*అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభం*
డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పరిధిలో 2025 సంవత్సరానికి డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి అని నాగర్‌కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మదన్ మోహన్, విశ్వవిద్యాలయపు అధ్యయన కేంద్ర సమన్వయకర్త ఎం. అంజయ్య ఒక ప్రకటనలో తెలిపారు.
గురువారం స్థానిక ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకుల సమక్షంలో అడ్మిషన్లకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇంటర్, ఐటీఐ లేదా ఇతర డిప్లమా కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.
ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, రెగ్యులర్ డిగ్రీకి సమానమేనని, విద్యార్థులు ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా అభ్యర్థించాలన్నారు. వచ్చే ఆగస్టు 13 లోపు ఓపెన్ డిగ్రీ కోర్సులో ప్రవేశం పొందాలని సూచించారు. అదే విధంగా 2వ & 3వ సంవత్సర విద్యార్థులు అడ్మిషన్ ఫీజు చెల్లించాలన్నారు.
అడ్మిషన్ కోసం విద్యార్థులు 10వ తరగతి మెమో, ఇంటర్ మెమో లేదా ఇతర అర్హతల సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్ ఫోటోలను అప్‌లోడ్ చేసి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏదైనా విద్యార్థులకు సందేహాలు ఉన్నచో 7382929779 నంబర్ లేదా నెల్లికొండ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల లో సంప్రదించాలని తెలిపారు.