ఆకలితో ఉన్న వారి ఆకలిని తీరుద్ధాం

 ఆకలితో ఉన్న వారి ఆకలిని తీరుద్ధాం

జెకె ట్రస్ట్ చైర్మన్ వి.నరసిహచారి

నవాబుపేట, ఆగస్టు 9 (మనఊరు ప్రతినిధి): ఆకలితో అలమటించే  వారి ఆకలిని తీరుద్ధాం, వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూద్దాం అనే నినాదంతో మానవ సేవే మాధవ సేవ అంటూ ప్రతి ఆదివారం నవాబుపేట మండల కేంద్రం చుట్టూ గల 70 గ్రామాలనుండి  సంత (అంగడి)కు వచ్చే పేద ప్రజల కోసం జెకె ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత భోజన కార్యక్రమాన్ని గత 49 వారాలుగా నిర్విరామంగా ట్రస్ట్ నిర్వాహకులు నిర్వహిస్తున్నారు. జెకె ట్రస్ట్ చైర్మన్, మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వి. నరసింహచారి, ఆయన సోదరుడు నవాబుపేట వ్యాపార సంఘం అధ్యక్షుడు వి. సుధాకర్ చారిల కుటుంబ సభ్యులు వారి తల్లిదండ్రుల స్మారకార్థం గ్రామానికి చెందిన పలువురు సామాజికవెత్తల తోడ్పాటుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అనేకమంది అన్నార్తుల   క్షుద్భాదను తీరుస్తుంది. అలాగే అనేకమంది ప్రముఖుల ప్రశంసలను అందుకుంటుంది. ఈ సందర్భంగా  జెకె ట్రస్ట్ చైర్మన్ నరసింహ్మ చారి మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత భోజన కార్యక్రమం 49 వారం కూడా విజయవంతంగా కొనసాగిందని తెలిపారు. మండల కేంద్రంలో నిర్వహిస్తున్న అంగడికి వస్తున్న పేద ప్రజలు ట్రస్ట్ ద్వారా ప్రతివారం అన్నదానం చేయడం వల్ల కడుపునిండా భోజనం చేస్తున్నామని, అక్కడ భోజనం చేయడం తమకు చాలా ఆనందంగా ఉందన్నారు. 

*పింఛన్ల పంపిణీ*

వృద్ధులకు వికలాంగులకు ప్రతినెల 10న పించన్లు 11వ నెల కూడా ప్రతి వృద్ధునికి, వికలాంగునికి రూ 100 చొప్పున 195 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, వృద్ధులు, వికలాంగులు, వివిధ గ్రామాల ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.















Previous Post Next Post