జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు నల్లమాల నందిని
అచ్చంపేట, పదర, ఆగస్టు 28 (మనఊరు ప్రతినిధి): నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని నల్లమల ప్రాంతం పదర గ్రామానికి చెందిన బండి నందిని భారత కబడ్డీ జట్టుకు ఎంపికైంది. సబ్‌జూనియర్ యూత్ ఏషియన్ కబడ్డీ టీమ్ ప్రాబబుల్స్‌లో నందిని చోటు దక్కించుకుందని జిల్లా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు గురువారం పేర్కొన్నారు. జాతీయ కబడ్డీ జట్టుకు నందిని ఎంపిక కావడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. నిరుపేద కుటుంబం నుంచి క్యాంపు కి ఎంపికైన. ఒక మారుమూల ప్రాంతం పదర గ్రామం నుండి ఇండియా కబడ్డీ అండర్/18 ఉమెన్స్ టీం క్యాంపుకు ఎంపికైన బండి నందిని ఈరోజు మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ ఘనంగా సన్మానించారు. చిన్నతనం నుంచి తనకు కబడి ఆటపై ఉన్న మక్కువతో కబడ్డీ ఆటను మొదలుపెట్టి ఆటలో మెలికలు నేర్చుకోవడం కబడ్డీ అసోసియేషన్ ప్రోత్సాహంతో నందిని రాష్ట్ర జాతీయ స్థాయి కబడ్డీ పోటీలలో ప్రతిభ కనబరిచి మంగళవారం ఇండియా కబడ్డీ జట్టు క్యాంపుకు ఎన్నికైనదని ఈ క్యాంపు ఢిల్లీలోని సోనీపత్ లో జరుగుతున్న ఇండియా క్యాంపులో శిక్షణ తీసుకుంటుందని నాగర్ కర్నూల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి యాదయ్యగౌడ్ లు తెలిపారు. ఇండియా క్యాంపుకు ఎంపికైన నందినికి తెలంగాణ రాష్ట్ర కబడి అసోసియేషన్ అధ్యక్షులు కాసాని వీరేశం, ప్రధాన కార్యదర్శి మహేందర్ రెడ్డి, ఇండియా మాజీ కోచ్ ఎల్ శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్, కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి కురుమూర్తిగౌడ్ లు సహకారము ఎప్పటికీ మర్చిపోలేనటువంటిది ఈరోజు హైదరాబాదు నుండి ఢిల్లీకి ఫ్లైట్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేందర్ రెడ్డి తన సొంత ఖర్చులతో పంపించారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ూ శ్రీనివాసులు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు రమేష్, మోహన్ లాల్, డాక్య, కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
నల్లమాల నుంచి జాతీయ కబ్బాడి కుకు ఎంపిక అవడం స్పూర్తిదాయకం
మహబూబ్ నగర్ ఎంపి డికె అరుణ
నల్లమాల ప్రాంతానికి చెందిన పదర గ్రామానికి చెందిన బండి నందిని భారత కబడ్డీ జట్టుకు ఎంపిక కావడంతో మహబూబ్ నగర్ ఎంపి డికె అరుణ సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అండర్-18 విభాగంలో రాష్ట్ల్ర స్థాయి పోటీల్లో జిల్లా జట్టు తరపున పాల్గొని మెరుగైన ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయిలో నిర్వహించే కబడ్డీ పోటీలకు ఎంపిక కావడం సంతోషించ దగ్గ విషయమన్నారు.