12ఏళ్ల బాలికకు 40 ఏళ్ల వ్యక్తితో పెళ్లి నందిగామలో దారుణం..

 *నందిగామలో దారుణం..*

*సిగ్గుండక్కర్లేదు.. 8వ తరగతి విద్యార్థినితో 40 ఏళ్ల వ్యక్తికి పెళ్లి..*

*డబ్బుందని 40 ఏళ్ల వ్యక్తితో సంబంధం కుదిర్చిన మధ్యవర్తి..* 

*మే 28న బలవంతంపు వివాహం..* 

*చదువుకోవాలని ఉండాలని పాఠశాల హెడ్మాస్టర్‌ను బాలిక ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి..* 

*బాలిక ఫిర్యాదుతో బాలిక తల్లి, వరుడు, మధ్యవర్తి, వివాహం జరిపిన పూజారిపై కేసు నమోదు..*

*రెండు నెలల కింద ఘటన.. ఎలా వెలుగులోకి వచ్చిందంటే..*

షాద్ నగర్, జులై 31 (మనఊరు ప్రతినిధి): రంగారెడ్డి జిల్లాల్లో బాల్య వివాహం కలకలం రేపింది. 13 ఏళ్ల బాలికను 40 ఏళ్ల వ్యక్తి వివాహం చేసుకున్నాడు. అయితే బాలిక తాను చదువుతున్న స్కూల్ ఉపాధ్యాయులకు ఈ విషయం తెలియజేయడంతో రెండు నెలల కిందట జరిగిన ఈ ఘటన వెలుగులోకి వచ్చింది..

*ఆ వివరాలు ఇలా ఉన్నాయి..*

 రంగారెడ్డి జిల్లా నందిగామకు ఓ మహిళ భర్త కొన్నేళ్ల కిందట చనిపోయాడు. ఆమెకు అప్పటికే ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ఆమె కూతురు (13) ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతుంది. ఆ మహిళ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంది.అయితే కొన్ని నెలల కిందట కూతురికి పెళ్లి చేయాలని ఆమె భావించింది. కుటుంబ పోషణ భారం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది.ఈ క్రమంలోనే ఓ మధ్యవర్తిని ఆశ్రయించింది. అయితే మధ్యవర్తి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంకు చెందిన ఓ 40 ఏళ్ల శ్రీనివాస్‌ గురించి చెప్పాడు. అతడికి ఆస్తి బాగా ఉందని తెలిపాడు.ఈ క్రమంలోనే మే 28న ఓ గుడిలో బాలికకు 40 ఏళ్ల వ్యక్తితో వివాహం జరిపించారు. అయితే బాలిక మైనర్ కావడం, ఆమె ఇష్టం లేకుండా పెళ్లి జరగడంతో ఈ విషయాన్ని స్కూల్ టీచర్‌కు తెలియజేసింది. దీంతో వారు మండల అధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. బాలిక తల్లి, పెళ్లికొడుకు శ్రీనివాస్, మధ్యవర్తి, వివాహం జరిపించిన పూజారిపై బాల్య వివాహ నియంత్రణ చట్టం కింద (ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్, 2006) పోలీసులు కేసు నమోదు చేశారు.అనంతరం బాలికను రెస్క్యూ హోంకు తరలించారు. ఇక, ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది..


Previous Post Next Post