11న విద్యార్థులకు నూలి పురుగుల మాత్రల పంపిణీపై ఉపాధ్యాయులకు శిక్షణ
నాగర్ కర్నూల్ , ఆగస్టు 7 (మనఊరు ప్రతినిధి): జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఉపాధ్యాయులకు నులిపురుగుల మాత్రలు పంపిణీ,జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం పై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈనెల 11న అరులైన ప్రతి విద్యార్థికి ఆల్బెండజోల్ మాత్రను వేసి నులిపురుగుల నివారణ తోడ్పాటు కావాలని పెద్దమొద్దునూర్ ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి డాక్టర్ సృజన కోరారు. ప్రాథమిక పాఠశాల ప్రాథమిక ఉన్నత పాఠశాల హైస్కూల్ కళాశాల లోని ప్రతి విద్యార్థికి మాత్రను వేసే విధంగా ఉపాధ్యాయుల సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి భాస్కర్ రెడ్డి హెల్త్ ఎడ్యుకేటర్ నరసింహ మండలంలోని ప్రభుత్వ , ప్రవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.