సత్యం విద్యాలయంలో ముందస్తు రక్ష బంధన్ వేడుకలు

 సత్యం విద్యాలయంలో ముందస్తు రక్ష బంధన్ వేడుకలు 

 జడ్చర్ల రూరల్, ఆగస్టు 8 (మనఊరు ప్రతినిధి): జడ్చర్ల పట్టణంలోని పాతబజార్ శివాలయం సమీపంలో ఉన్న సత్యం విద్యాలయంలో శుక్రవారం రక్ష బంధన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఒకరినొకరు రాఖీలు కట్టుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా సత్యం విద్యాలయం చైర్ పర్సన్ జీనురాల మంగ మాట్లాడుతూ రక్షాబంధన్ పండుగ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. రాఖీ పండుగ సోదరీ సోదరుల ప్రేమానురాగాలకు ప్రతీక అని, రక్షాబంధన్ పండుగను ప్రజలంతా ఆనందోత్సవాలతో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో , ప్రిన్సిపాల్ భాగ్యలక్ష్మి. వైస్ ప్రిన్సిపాల్ నేహా, ఉపాధ్యాయురాలు సుప్రియ, రూహిన రోజా, ఉమాదేవి , అంజూమ్, నాగలక్ష్మి, సంధ్య, రాయిజా, సత్యం, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.




Previous Post Next Post