కళ్లలో కారంపొడి చల్లి రూ.3 లక్షలు దోపిడీ
జడ్చర్ల రూరల్, 8 (మనఊరు ప్రతినిధి): జడ్చర్ల మండల పరిధిలోని నక్కల బండ తండా వద్ద 167వ జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి జరిగింది. ఈ ఘటనలో తీవ్ర కలకలం సృష్టించింది. జడ్చర్ల పట్టణంలోని ఓ వైన్స్ వ్యాపారి ఉదయం నుంచి అమ్మిన నగదు తీసుకొని తను ద్విచక్ర వాహనంపై నగర్‌లో ఉన్న ఇంటికి వెళ్తుంది వచ్చిన ఇద్దరు దుండగులు కళ్లలో కారంపొడి చల్లి రూ. 3 లక్షల నగదును లాక్కెళ్లిన ఘటనలో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జడ్చర్ల పట్టణంలో కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న రితి వైన్స్ లో క్యాష్ కౌంటర్ లో పనిచేస్తున్న అరుణ్ కుమార్ గురువారం అర్ధరాత్రి 12 తర్వాత వైన్స్ లో ఉదయం నుంచి మద్యం అమ్మిన కలెక్షన్ రూ. 3 లక్షలు తీసుకుని తన స్కూటీపై మహబూబ్ నగర్ లోని తన ఇంటికి వెళ్తున్నాడు. ఈ కోరికనే నక్కల బండ తండా వద్దకు చేరుకోగానే మరో ద్విచక్ర వాహనంపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అరుణ్ కుమార్ స్కూటీని అడ్డగించి కళ్లలో కారంపొడి చల్లి అతని వద్ద ఉన్న మూడు లక్షల రూపాయల బ్యాగును లాక్కొని కాస్త ముందరికి వెళ్లి యూటర్న్ తీసుకొని మళ్ళీ జడ్చర్ల వైపే వెళ్ళినట్లు బాధితుడు తెలియజేశారు.