తెలంగాణ యూట్యూబ్ చానల్ అసోసియేషన్ అధ్యక్షులుగా పాపారావు
హైదరాబాద్, ఆగస్టు 9 (మనఊరు ప్రతినిధి): తెలంగాణ యూట్యూబ్ చానల్ అసోసియేషన్ అడహాక్ కమిటీ ఎన్నికలు శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ యూట్యూబ్ చానల్ అసోసియేషన్ అధ్యక్షులుగా పులిపాటి పాపారావు వై7 న్యూస్ తెలుగు, ఉపాధ్యక్షులుగా ఎండి ఫసీయోధిన్ ఎంఎఫ్ఎస్ఎన్ చానల్, ప్రధాన కార్యదర్శిగా పి. శ్రీనివాస్ ఎస్ పి మిడియ తెలుగు, కోశాధికారిగా రామడుగు కొమరన్న ఎస్ టి జె న్యూస్, గౌరవ అధ్యక్షులుగా బైల్‌పాటి జయ గణేష్ జిఎస్ 6 న్యూస్, గౌరవ సలహాదారుగా రామ్ టెంకి శ్రీనివాస్ ఎన్ కె 24 టివిలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు పులిపాటి పాపారావు మాట్లాడుతూ అసోసియేషన్ ఏర్పాటుతో తెలంగాణలోని యూట్యూబ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేయనున్నట్లు తెలిపారు. వారి హక్కుల సాధనకు మరింత బలమైన వేదిక ఏర్పడుతుందని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యూట్యూబ్ చానల్ సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ యూట్యూబ్ చానల్ అసోసియేషన్ అధ్యక్షులుగా