వైభవంగా శనేశ్వర స్వామికి శ్రావణ పౌర్ణమి తిలతైలా అభిషేక పూజలు...

వైభవంగా శనేశ్వర స్వామికి శ్రావణ పౌర్ణమి తిలతైలా అభిషేక పూజలు...

పరమశివునికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలలు

శ్రీ విశ్వవసు సంవత్సరం శ్రావణ మాసం శుక్ల పక్షం శనివారం రాఖీ పౌర్ణమి నాడు బీజినేపల్లి మండలం పరిధిలోని నంది వడ్డేమాన్ గ్రామంలో గల శనేశ్వర స్వామికి భక్తులచే తిల తైల అభిషేక, అర్చన, తదియ ప్రత్యేక పూజలు, అభిషేకాలు వైభవంగా భక్తిశ్రద్ధలతో జరిగాయి. శ్రీసార్థసప్త జ్యేష్టమాత సమేత శనేశ్వర స్వామికి శని వారం శ్రావణ పౌర్ణమి తిథి నాడు ప్రత్యేకంగా తిల తైల అభిషేకాల పూజలు జరిగాయి.

ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమఠంవిశ్వనాథ శాస్త్రి మాట్లాడుతూ శ్రావణమాసంలో భక్తి పూర్వకంగా స్వామివారిని కొలచడం ఎంతో విశేష ఫలితం అన్నారు.భక్తులు ప్రతి మాసంలో శనివారం నాడు అష్టమి,నవమి,త్రయోదశి,చతుర్దశి,అమావాస్య తిథులు ఉన్న రోజు శనేశ్వర స్వామిని పూజించిన విశేష ఫలితం ఉంటుందన్నారు.ఇక్కడ గోన బుద్ధారెడ్డి కాలం నాటి బ్రహ్మ సూత్రం గల పరమశివునికి ఈరోజు భక్తులచే సామూహిక మహాన్యాస పూర్వక రుద్రాభిషేకపూజలు,అర్చనలు ప్రత్యేకంగా నిర్వహించినట్లు తెలిపారు.భక్తులు జమ్మి చెట్టుకు19 ప్రదక్షణలు వేదమంత్రచరణల మధ్య నిర్వహించారు.గణపతి,నందీశ్వర స్వామి వారికి ప్రత్యేక అర్చనపూజలు నిర్వహించారు. భక్తులచే నిర్వహించారు.అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనం తీర్థప్రసాదాల పంపిణీ చేశారు.ఈకార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెల్దండ గోపాల్ రావు, కమిటీ సభ్యులు కేంచే రాజేష్ ప్రభాకరచారి, పుల్లయ్య,వీర శేఖర్, శ్రీకాంత్ రెడ్డి,ఆలయ ఆర్చకులు గవ్వమఠం శాంతి కుమార్, ఉమామహేశ్వర్, సిబ్బంది గోపాల్ రెడ్డి భక్తులు, మహిళలు,అధిక సంఖ్యలో ఉన్నారు.



Previous Post Next Post