అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే.....

 అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే.....

సత్యసాయి మందిరంలో శాస్త్రోక్తంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు.......

63 మహిళా కుటుంబాలచే వరలక్ష్మి వ్రతాలు...

 వరలక్ష్మి మాతను పూజించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.....

భక్తి శ్రద్ధలతో పాల్గొన్న మహిళలు, భక్తులు.....

నాగర్ కర్నూల్, ఆగస్టు 8 (మనఊరు ప్రతినిధి): జిల్లా కేంద్రంలోని భగవాన్ శ్రీ సత్యసాయి మందిరంలో శ్రావణ 3వశుక్రవారం నాడు శాస్త్రోక్తంగా వేద మంత్రోచ్ఛారణల మధ్య సామూహిక వరలక్ష్మీ వ్రతాలు వైభవంగా భక్తిశ్రద్ధలతో మహిళలు నిర్వహించినట్లు సత్యసాయి సేవా సమితి కన్వీనర్ హకీమ్ విశ్వప్రసాద్ తెలిపారు. సత్యసాయి మందిర ఆలయ ప్రధాన పూజారి వావిలాల రాజశేఖర్ శర్మ వరలక్ష్మీ వ్రతాలను వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షీర సాగరం నుండి జన్మించిన మహాలక్ష్మి దేవి, సోదరుడు చంద్రుడు, పూర్ణ కాంతి సమయంలో పరమ శివుని పార్వతి దేవి వరంగా కోరిన వ్రతమే వరలక్ష్మీ వ్రతం అని ఆయన అన్నారు. వరలక్ష్మి వ్రత విశిష్టతను తెలుపుతూ

స్త్రీ సూక్తం ఆధారంగా చారుమతి బ్రాహ్మణ మహిళ మొదట ఆచరణతోపూజించి, భారతీయులకు అందించిన వరమని ఆయన తెలిపారు.

అమ్మవారిని వివిధ విశేష పూజాద్రవ్యాలు, ప్రత్యేక మంత్రములతో పూజించిన వారికి అష్టైశ్వర్యాలు వారి కుటుంబం సౌభాగ్యం, ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు. ధన, ధాన్య ,ధైర్య, సిద్ధి, శౌర్య,విద్య , సంతానం, ఆరోగ్యం, వరాలు,ఐశ్వర్యాలు పొందుటకు అత్యంత సులభమైన మార్గం వరలక్ష్మీ వ్రతం అనిఅన్నారు.

 శ్రావణ మాసంలో మహా విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రం, శ్రావణ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు అమ్మవారిని వరలక్ష్మీ రూపంలో పూజించడం విశిష్ట పుణ్య ఫలితం అందుతుందని ఆయన అన్నారు. అమ్మవారిని కొలచడం, కొలిచిన వారికి కొంగు బంగారంగా వరాలు ప్రాప్తి, అందజేస్తుందని అన్నారు. అనంతరం ఆలయంలో బాబా వారి భజనలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. 63 కుటుంబాల మహిళలు ఒకరికి ఒకరు సాంప్రదాయంగా, వాయనాలు, పసుపు, కుంకుమలు, అందజేస్తుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం సామూహిక భోజనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి మహిళా సభ్యులు శారదమ్మ, కొండూరు లలిత, ఎలిమి సునీత, నాగమణి బాలమణి , అరుణ, శివమ్మ శ్రీసాయి ప్రశాంతి చారిటబుల్ సేవ ట్రస్ట్ కన్వీనర్ ఎలిమ ఈశ్వరయ్య, సభ్యులు మన్యపురెడ్డి, వెంకట్ శెట్టి, విజయ భాస్కర్, పాండురంగారెడ్డి, రాజు, మహిళలు, చిన్నారులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.







Previous Post Next Post