పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులుగా రాజేందర్

 పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులుగా రాజేందర్


కల్వకుర్తి, ఆగస్టు 8 (మనఊరు ప్రతినిధి): పట్టణ శ్రీమార్కండేయ పద్మశాలి సంఘం అధ్యక్షులుగా మేకల రాజేందర్ ను శుక్రవారం పద్మశాలి భవనంలో ఎన్నికల అధికారులు భావండ్ల వెంకటేష్, మేకల వెంకటేశం , భావాండ్ల శ్రీను , క్యామమల్లేష్, పున్న సురేష్ ల ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శిగా మాకం రమేష్, కోశాధికారిగా గంజి ప్రసాద్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మేకల రాజేందర్ మాట్లాడుతూ పద్మశాలిలు ఐక్యతతో సమాజానికి ఆదర్శంగా ఉండాలని, ఉన్నత పదవులు చేపట్టాలని, సంఘం అభివృద్ధికి బాటలు వేయాలని అన్నారు. పద్మశాలి సమాజానికి అవసరం పడే విధంగా పనిచేస్తానని, రాజకీయాలకతీతంగా అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి పట్టణ మాజీ అధ్యక్షులు నాగుల వెంకటేశ్వర్లు, భావండ్ల మధు, ప్రస్తుత ఉత్సవ కమిటీ కన్వీనర్ గుజ్జరి శ్రీను, కో కన్వీనర్ మాకం నారాయణ, పెద్దలు గంజి మురళి, ముత్యాలు, సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post