జర్నలిస్ట్ శ్రీనివాస్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్టులు
జడ్చర్ల రూరల్, ఆగస్టు 12 (మనఊరు ప్రతినిధి): జడ్చర్ల జర్నలిస్టు తాంబూలం శ్రీనివాస్ జన్మదినాన్ని పురస్కరించుకొని.. జడ్చర్లలోని ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా జర్నలిస్టులు మంగళవారం సోషల్ మీడియా వాట్సప్, ట్విట్టర్ లా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. జర్నలిజంలో తనదైన శైలిలో ఉత్తమ సేవలందిస్తూ.. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఎన్నో సంచలనాత్మకమైన విశేషాలు వార్తలు ఎప్పటికప్పుడు సమాజానికి అందిస్తూ.. సమాజ సేవ చేస్తున్న శ్రీనివాస్ జన్మదినం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని జర్నలిస్ట్ సోదరులు తెలిపారు. అంతకు ముందు జర్నలిస్టులు, యువకులు, నాయకులు, తదితరులు శాలువాతో సత్కరించి, కేక్ కట్ చేయించి ఒకరినొకరు తినిపించుకోని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.