కళలకు ఆదరణ పెరుగుతుంది...... పి.వి.పిఅంజనీ కుమారి...
హైదరాబాద్: శ్రీ శిఖరం ఆర్ట్స్ థియేటర్ అధినేత శ్రీ జి ,కృష్ణ గారు ఆధ్వర్యంలో కూచిపూడి భరతనాట్యం perani శ్రావణ నత్య సూరభం శ్రావణ మాస సందర్భంగా చిన్నారులతో నాట్య ప్రదర్శన, అలాగే గురువులకు సన్మానము. తెలుగు సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమం బొగ్గులకుంట లోని తెలంగాణ సారస్వత పరిషత్తు, నందు ఈ కార్యక్రమం ఎంతో సాంప్రదాయ సాంస్కృతిక విలువలు అంటే తెలుగుతనం ఉట్టిపడే విధముగా రంగ రంగ వైభవంగా జరిగినది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ శ్రీమతి పివిపి అంజనీకుమారి మాట్లాడుతూ మరల మన లైఫ్ రీసైకిల్ అవుతుంది తెలుగుతనము మన సాంప్రదాయ వ్యవహార శైలికి ఇది ఒక నిదర్శనం ఇలాంటి కార్యక్రమాలు మన దేశంలో న్యూఢిల్లీ,హైదరాబాదు, విశాఖపట్నం రాజమండ్రి అనేక ప్రాంతాలలో జరపాలి అంటే అదే కృష్ణగారికి సాధ్యం అని అన్నారు. ప్రతి ఒక్కరికి సంపాదన అవసరమే కానీ దానితోపాటు మన సాంప్రదాయాలను మన సంస్కృతిని కాపాడుకోవడం కూడా అవసరము, ప్రస్తుత పరిస్థితుల్లోకళలు కనుమరు అవుతున్న తరుణంలో నాట్య గురువులు ప్రేరణతో తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతో విద్యార్థులు కళలు సాహిత్యం వైపు దృష్టి సారించడం అనేది ప్రస్తుత పరిస్థితులలో శుభపరిమానముగా మనం భావించవచ్చు, ప్రస్తుతం యువత చూస్తే మనకున్న టైం కొంత పిల్లలతో గడపడం చాలా అరుదుగా మారినాయి, దయవుంచి తల్లిదండ్రులకి నా విజ్ఞప్తి ఈరోజు ఈ కార్యక్రమం చూస్తుంటే ఒక కుటుంబం తో ఆనందంగా సాయంత్రము సమయము ఒక పక్క శ్రావణమాసం లక్ష్మీదేవి పూజ రాఖీ పౌర్ణమి ఇలా మన బిజీ లైఫ్ లో ఈ మూడు రోజులు అందరం కలిసి ఉన్నాము ఇలాంటి కార్యక్రమంలో కొంతమంది కుటుంబాలు ఇక్కడ పాల్గొనడం జరిగినది అసలు ఈ కంప్యూటర్ ప్రపంచంలో మనము ఇలా కలుసుకోవడం మన లైఫ్ లో జరుగుతునాయి, అంటే నా సమాధానం లేదనే చెబుతాను, మనము డబ్బు సంపాదన ఒకరి కంటే ఇంకా మెరుగ్గా మనము మన కుటుంబము ఉండాలి అనే తపనలో మనము ఏం చేస్తున్నాము మన పిల్లలు ఏం చేస్తున్నారు మనకు తెలియకుండానే మన మధ్య చాలా గ్యాప్ అనేది ఏర్పడుతుంది, పిల్లలను బాగా చదివించాలి అని గవర్నమెంట్ ప్రోత్సహిస్తున్న విద్యాలయాలను వదిలేసి కార్బోరేట్ విద్యాలయాలలో కార్బోరేట్ లైఫ్ కి ప్రాధాన్యత ఇస్తూ కుటుంబ బాంధవ్యాలకు దూరంగా జీవిస్తున్నాము, భారతదేశం లో ఓ పక్క డ్రగ్స్ మాఫియా లైంగిక వేధింపులకు గురవుతున్నాము, మనము కొంత సమయాన్ని మన పిల్లలతో స్నేహితుడిగా గడిపితే వారిలో ఉన్న ప్రతిభ బయటకు వస్తుంది, పిల్లల భవిష్యత్తుకు చదువు ఒక్కటే మార్గం కాదు దానితో పాటు కళలలో కూడా పిల్లలను ప్రోత్సహించి వారు దేనిలో అయితే నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు దాన్ని మనము ప్రోత్సహిస్తే పిల్లలకి బంగారు లైఫ్ ఇవ్వగలము, మరి ఇలాంటి గురువులు కృష్ణ గారు లాంటి కళలను ప్రోత్సహించే వ్యక్తులు దొరకటం మన అదృష్టము ఈ సాయంత్రం మనము మన కుటుంబంతో కలిసి ఒక మంచి సినిమా చూడలేమేమో గాని ఒక మంచి కార్యక్రమాన్ని తనివి తీరా చూస్తున్నాము ఇది మనకి అలా అలా గుర్తుండిపోతుంది, ఇలాంటి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నాకు అవకాశం ఇచ్చి మీతో మమేకమైనందుకు నాకు అవకాశం కల్పించిన కృష్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదములు ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు మరియు నాట్య గురువులకు మరియు తల్లిదండ్రులకు ఉదయ పూర్వక అభినందనలు, అలాగే మరియొక అతిధి రాగా రంజని గారితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది అన్నారు, మరియొక అతిధి రాగ రంజని గారు మాట్లాడుతూ ఇలాంటి కళలు పట్ల పిల్లలను ప్రోత్సహించాలి చిన్నారులు చాలా ఆనందంగా ఉత్సాహముతో ఈ కార్యక్రమం లో పాల్గొని వాళ్ళ నాట్య ప్రదర్శనతో సభను ఎంతో ఉల్లాసంగా ముందుకి తీసుకొని వెళ్ళినారు ఇలాంటి కూచిపూడి భరతనాట్యం పేరని కళలలో పిల్లలకు నాడీ వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది వాళ్ళ జీవన విధానంలో ఆరోగ్యకరమైన వాతావరణానికి కల్పిస్తుంది, తల్లిదండ్రులకు నా విజ్ఞప్తి పిల్లలను కళలపట్ల ప్రోత్సహించాలి తల్లిదండ్రులు ప్రోత్సహించాలి అని అన్నారు, ఈ కార్యక్రమం ఆదివారం తేదీ 10.08.2025 న సాయంత్రం 4 pm నుండి రాత్రి 9 గంటల వరకు కొనసాగినది.