పెత్తందారి వ్యవస్థను రూపుమాపిన ధీశాలి పండుగ సాయన్న

 పెత్తందారి వ్యవస్థను రూపుమాపిన ధీశాలి పండుగ సాయన్న

*బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పల్లె తిరుపతి ముదిరాజ్*

*మహబూబ్ నగర్ జిల్లాకు పండుగ సాయన్న పేరు పెట్టాలి*

మిడ్జిల్, ఆగస్టు 8 (మనఊరు ప్రతినిధి): పెత్తందారి వ్యవస్థను రూపుమాపిన ధీశాలి పండుగ సాయన్న,బడుగు, బలహీన వర్గాల ప్రజలకు పండుగ సాయన్న ఆదర్శ ప్రాయుడని, ఆయన ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పల్లె తిరుపతి ముదిరాజ్ అన్నారు. శుక్రవారం మిడ్జిల్ మండల కేంద్రంలోని 167వ నెంబర్ జాతీయ రహదారి చౌరస్తాలో పండుగ సాయన్న జయంతి సందర్భంగా ఆయన చిత్రపటా నికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా పల్లె తిరుపతి మాట్లాడుతూ బహుజన వీరుడు పండుగ సాయన్న నిజంలకు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న తరుణంలో చాలా గ్రామాల్లో ఆకలితో అలమటించేవి ఇవి చూసి చల్లించిన సాయన్న గ్రామాలకు తిండి పెట్టాలని ఆలోచించి ఉర్లకు ఉర్లాను ఒక చోట చేర్చి వారికి కావాల్సిన ఆహార ధాన్యాలను దోపిడి చేసి తీసుకొని వచ్చి వారికి ఇచ్చేవాడు. అలాగే సమీపంలోని ఉన్న మైసమ్మ అడవి ప్రాంతంలో సాయన్న పండుగ చేసి చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు భోజనం పెట్టి ఆకలి తీర్చేవాడని గుర్తు చేశారు. అప్పట్లో ఆకలి తీరాలంటే సాయన్న ఎక్కడో ఒకచోట దారి దోపిడీ చేసి వంటలు వండించి పండుగలు కందూర్లు చేసేవాడు. మహబూబ్ నగర్ జిల్లాకు పండుగ సాయన్న పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇష్టమైన దసరా, పీర్ల పండుగ ఒకే రోజు కలిసి వచ్చిన ఏడాది జన్మించడంతో అతనిని ప్రజలు పండుగ సాయన్నగా పిలుచుకోవడం మొదలుపెట్టారు అప్పటివరకు తెలుగు సాయన్నగా ఉండేవాడని వారు అన్నారు. ప్రభుత్వం పండుగసాయన జయంతిని ప్రభుత్వ అధికారికంగా నిర్వహించాలని అదేవిధంగా ఇలాంటి గొప్ప ప్రజా వీరుడు పేరును మహబూబ్నగర్ జిల్లా పేరు మార్చి జిల్లాకు పండుగ సాయన్న జిల్లాగా మార్చాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో *మత్స్య సహకార సంఘం అధ్యక్షులు పట్నం జంగయ్య, ముదిరాజ్ సంఘం నాయకులు ఎన్ రాజేశ్వర్, బండారి ప్రశాంత్ ,పట్నం అంజయ్య, పల్లె శ్రీను, జమ్ముల శివ, పట్నం రమేష్, ఎలికంటి కృష్ణయ్య, ఎస్.కె సుదర్శన్, ఎలకంటి ఆంజనేయులు, ఎలికంటి పరుశురాం, పల్లె అరవింద్, పల్లె లక్ష్మయ్య, వినోద్, బాలకృష్ణయ్య, ఎడ్ల మల్లేష్, పల్లె మౌని రమేష్, రాశికే వెంకటయ్య, కుమార్, పిట్టల సాయి, పట్నం నవీన్, బండారి కిషోర్, గుళ్ళ మల్లేష్, అంతారం శివ, పిట్టల ఆంజనేయులు, ఎస్.కె జనార్దన్, బండారి పవన్, నాయకులు ఎల్లమశెట్టి శ్రీనివాస్, వెంకటయ్య, చారి, తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post