లోయలో పడిన ఓ కంంపణి బస్సు

 భారీ వర్షానికి రోడ్డు కోత

లోయలో పడిన ఓ కంంపణి బస్సు 

భూత్పూర్, ఆగస్టు 14 (మనఊరు ప్రతినిధి); మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నుంచి కర్నూలు వెళ్లే 44వ జాతీయ రహదారి దివిటిపల్లి దగ్గర నాలుగు రోజుల నుంచి భారీ వర్షం కురుస్తున్న కారణంగా బుధవారం దివిటిపల్లి దగ్గర ఉన్న ఐటీ పార్క్ వెళ్లే రోడ్డు మొత్తము 15 ఫీట్ల వరకు కోసుకోవడంతో పెద్ద లోయగా ఏర్పడింది అది గమనించకుండా అమర్ రాజ్ కంపెనీ బస్ రోజువారిగా కంపెనీలో పనిచేసే ఉద్యోగులను తీసుకెళ్తుండగా కోసుకుపోయిన రోడ్డును గమనించిన డ్రైవర్ బ్రేక్ వేయగా అవరత నీరుకు బస్సు కంట్రోల్ కాకపోవడంతో లోయలో పడిపోయింది అందులో ఉన్న ఉద్యోగులకు స్వల్పంగా గాయాలు అయినట్టు తెలిపారు. అదేవిధంగా షేర్ పల్లి దగ్గర నా ఎస్ బి ఎల్ కంపెనీ కంపెనీ ముందు రోడ్డు నిర్మాణం జరుగుతున్నందున ఇరువైపులా రోడ్డు తోవడంతో పైనుంచి వరద నీరు ఎక్కువ రావడంతో వచ్చిపోయే ప్రయాణికులకు రోడ్డు కనిపియ్యకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయం పోలీస్ శాఖ వారు గమనించి ప్రమాద స్థలానికి వచ్చి పోయే ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా అక్కడ ఉండి సూచనలు చేశారు.





Previous Post Next Post