నవోదయ పాఠశాల మంజూరు పట్ల హర్షం

 *నవోదయ పాఠశాల మంజూరు పట్ల హర్షం.*.

*బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పల్లె తిరుపతి*

మిడ్జిల్, ఆగస్టు 9 (మనఊరు ప్రతినిధి): నియోజకవర్గంలోని బాలానగర్ మండలం పరిధిలోని పెద్దాయపల్లి గ్రామ శివారులో నవోదయ పాఠశాల మంజూరుకు కృషి చేసిన పాలమూరు పార్లమెంటు సభ్యురాలు డి కె అరుణకి బిజేవైఎం నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ శనివారం మిడ్జిల్ మండల కేంద్రంలో బిజెపి మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఎంపీ డీకే అరుణమ్మ గారికి పాలభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పల్లె తిరుపతి మాట్లాడుతూ పాలమూరు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మహబూబ్నగర్ పార్లమెంటుకు కేంద్రం నుండి నవోదయను మంజూరు చేయించారు ఈ పాఠశాల నిర్మాణానికి అనువైన స్థలం కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఖరారు కావడం ఎంతో సంతోషం ఈ ఏడాది నుంచి పాలమూరు జిల్లాలో నవోదయ పాఠశాల సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ పాలమూరు పార్లమెంట్లో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతూ అభివృద్ధి దేంగా పనిచేస్తున్న నాయకురాలు డీకే అరుణమ్మ మన పార్లమెంటుకు ఎంపీ కావడం మన అందరి అదృష్టమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి బిజెపి మండల అధ్యక్షులు నరేష్ నాయక్, మాజీ మండల అధ్యక్షుడు కావలి నరేందర్, సీనియర్ నాయకులు వెంకటయ్య, వాసుదేవ్, శేఖర్, బుచ్చయ్య, భీమయ్య, బర్త్డేశేఖర్, ఎల్లయ్య , వెంకటరెడ్డి, బీరయ్య, ఆంజనేయులు,దేవేందర్, విష్ణునాయక్ , అంజి, నాగేష్ ,మహేష్, నరేష్ చారి, వడ్డే నవీన్ , రాఘవేందర్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post