*లక్ష్మీపల్లిలో ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు*
ఉపాధ్యాయ వృత్తి మహోన్నతమైనది
పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు లయన్ అశ్వినిచంద్రశేఖర్
దేవరకద్ర, సెప్టెంబరు 4 (మనఊరు ప్రతినిధి): ఉపాధ్యాయ వృత్తి మహోన్నతమైనదని పిఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు లయన్ అశ్విని చంద్రశేఖర్ అన్నారు. భారత రత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 138వ జయంతి ని పురస్కరించుకొని దేవరకద్ర వారి లక్ష్మీపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల ల ఆవరణలో గురుపూజ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక ఉపాధ్యాయుడు విధి నిర్వహణలో పొరపాటు చేస్తే దాని ప్రభావం మొత్తం సమాజంపై ఉంటుందన్నారు. అందువల్ల ఉపాధ్యాయులపై సామాజిక బాధ్యత ఎంతో ఉందని అన్నారు. ఉపాధ్యాయుల కృషి ఫలితంగానే నేడు సమాజంలో ఎంతోమంది ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నారని తెలిపారు. దేశానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు. అనంతరం ఉన్నత పాఠశాలకు చెందిన సీనియర్ ఉపాధ్యాయులు కమల్ రాజ్ (ఎస్ ఏ హిందీ), కె. మురళీ ధర్ (ఎస్ ఏ గణితం)లను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఉన్నత పాఠశాల హెచ్ఎం కె కె శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన గురు పూజోత్సవ వేడుకలో భారత రత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ దేశానికి అందించిన ఎనలేనివని అన్నారు.
ఉపాధ్యాయులుగా, ఉప కులపతిగా, ఉప రాష్ట్రపతిగా, రాష్ట్ర పతిగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశానికి గొప్ప సేవలు అందించారని అన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయడానికి. ఉన్నత పాఠశాల హెచ్ఎం కె శ్రీనివాస్ మాట్లాడుతూ సర్వేపల్లి జీవితాన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు మురళీధర్, కమల్ రాజ్, అశ్విని చంద్రశేఖర్, ఆశ్ర ఖాద్రి, విజయలక్ష్మీ, కావాలి సుజాత, విద్యార్థులు, జరిగింది.