గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ భాగస్వామిగా ఎల్ఐసి ఏజెంట్ నరేశ్

 గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ భాగస్వామిగా ఎల్ఐసి ఏజెంట్ కె.నరేశ్ 

 ప్రశంసా పత్రాన్ని ప్రధానం చేసిన ఎల్ఐసి అధికారులు

మహబూబ్ నగర్, సెప్టెంబరు 5 (మనఊరు ప్రతినిధి): ఎల్ఐసి ఏజెంట్ గా పనిచేయడం ప్రారంభించిన స్వల్ప వ్యవధిలోనే మహబూబ్ నగర్ బ్రాంచ్ ఎల్ఐసి ఏజెంట్ కె.నరేష్ ఎల్ఐసి ఏజెన్సీ వృత్తిలో అత్యంత ప్రతిభను కనబరుస్తూ ఆ సంస్థ అధికారులచే అనేక అవార్డులు రివార్డులు పొందడమే కాకుండా వారి ప్రశంసలు అందుకుంటున్నారు. తనకు అందుబాటులో ఉన్న వారందరికీ ఎల్ఐసి పాలసీల యొక్క ప్రాముఖ్యతను గురించి విపులంగా వివరిస్తూ వారందరిచేత ఎల్ఐసి పాలసీలను చేయిస్తూ తన వృత్తి ధర్మాన్ని సంపూర్ణంగా నిర్వర్తిస్తున్నారు. ప్రతి ఇంటికి కనీసం ఒక పాలసీని ఇస్తూ ఆ పాలసీ వారి కుటుంబానికి ఏ విధంగా ఉపయోగపడుతుందనే విషయాలను గురించి సీనియర్ ఏజెంట్లకు ఏమాత్రం తీసిపోని విధంగా కూలంకుషంగా వివరిస్తూ వారి చేత పాలసీలు చేయిస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం తాను నివాసముంటున్న కురుమూర్తి ప్రాంతంలో అందరికీ పాలసీలను గురించి వివరిస్తూ ఎల్ఐసి నరేశ్ గా ఆయన పేరుగాంచారు. ఆయన ఎవరికి కనిపించినా ఎల్ఐసి నరేశ్ సార్ గా పిలవడం ఆ ప్రాంతం ప్రజలకు పరిపాటిగా మారింది.

దేశంలోని జీవిత బీమ సంస్థలన్నింటిలో అగ్రగామిగా ఉన్న భారతీయ జీవిత బీమ సంస్థ ఓ చాలెంజిగా తీసుకుని ఈ సంవత్సరం జనవరి 20వ తేది ఒకే రోజు దేశంలోని ఇతర ఏ ఎల్ఐసి సంస్థ సాధించని అత్యంత విశిష్టమైన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించడంలో కూడా నరేశ్ భాగస్వామిగా నిలిచారు.ఎల్ఐసి ఆఫ్ ఇండియా గురువారం మహబూబ్ నగర్ ఎల్ఐసి బ్రాంచ్ సీనియర్ మేనేజర్ అందుకు సంబంధించిన 

ప్రశంసా పత్రాన్ని నరేశ్ కు ప్రధానం చేశారు. దేశంలోని ఇతర ఎల్ఐసి సంస్థలన్నింటిలోకంటే అత్యధికంగా ఒకే రోజు 24 గంటలలో 5,88,107 పాలసీలు చేసి ఎల్ఐసి ఆఫ్ ఇండియా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది. ఉన్నత విద్యాభ్యాసం చేసి పలు కంపెనీలలో పని చేసిన నరేశ్ అక్కడి వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆ ఉద్యోగాలలో వదిలేసి జీవనోపాధి కోసం ఎల్ఐసి ఏజెన్సీని చేపట్టి, ఆ వృత్తిని చేపట్టిన అతి తక్కువ వ్యవధిలోనే మంచి ప్రతిభ కనబరుస్తూ అనేక అవార్డులు, రివార్డులను సొంతం చేసుకుంటూ ఆ వృత్తిలో ముందుకు దూసుకెళ్తున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్ఐసి ఆఫ్ ఇండియా గిన్నీస్ రికార్డు సాధించడంలో తాను భాగస్వామిగా నిలవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అత్యంత విశిష్టమైన రికార్డును ఎల్ఐసి సాధించడంలో భాగస్వామిని అయినందుకు ఎల్ఐసి ఆఫ్ ఇండియా బ్రాంచి సీనియర్ మేనేజర్ మధు కుమార్, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ సేల్స్ కృష్ణ ప్రసాద్, డెవలప్మెంట్ ఆఫీసర్ మహేష్ ల చేతుల మీదుగా అందుకు సంబంధించిన సర్టిఫికెట్ ను గురువారం బ్రాంచి కార్యాలయంలో నిర్వహించిన ఏజెంట్ల దినోత్సవం కార్యక్రమంలో అందుకోవడం తనకు మధురానుభూతుని మిగిల్చిందని అన్నారు.ఈ సర్టిఫికెట్ ను సాధించడంలో భాగస్వాములైన మిత్రులకు,శ్రేయోభిలాషులకు, ఎల్ఐసి అధికారులకు,సిబ్బందికి,కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా తన పాలసీదారులందరికీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు. ఇకముందు ఇదే ఉత్సాహంతో ఇంటింటికి తిరిగి అందరికీ ఎల్ఐసి పాలసీలను ఇవ్వడమే తన ధ్యేయమని, ప్రస్తుతం తాను నివాసముంటున్న కురుమూర్తి ప్రాంతంలోని ప్రజలంతా తన దగ్గర పాలసీలు తీసుకొని తనకు సహకరించాలని కోరారు. పాలసీలు పూర్తయ్యే వరకు తల సేవలు నిరంతరంగా అందిస్తానని ఆయన పేర్కొన్నారు. అందుకోసం తన శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు.

Previous Post Next Post