జర్నలిస్టులపై రమాకాంత్ అనుచిత వ్యాఖ్యలు సరికాదు.!
తీవ్రంగా ఖండించిన జర్నలిస్టులు
నాగర్ కర్నూల్, సెప్టెంబరు 7 (మనఊరు ప్రతినిధి): జర్నలిస్టులపై అచ్చంపేట పట్టణ కేంద్రానికి చెందిన మాతృభూమి సంస్థ, మహేంద్ర సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి రమాకాంత్ జర్నలిస్టులపై చేసిన నాగర్ కర్నూల్ మహేంద్ర సంఘం వాట్సాప్ గ్రూప్లో అనుచిత వ్యాఖ్యలకు చేసినందుకు జర్నలిస్టులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో జర్నలిస్ట్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన తక్షణమే జర్నలిస్టుకు బహిర్గతమైన క్షమాపణ చెప్పి, మాట్లాడిన మాటలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుటుంబాల మధ్య ఏవైనా తగాదాలు ఉంటే, సొంత విషయాలు ఏవైనా ఉంటే చట్టపరంగా పరిష్కరించాలని, న్యాయపరంగా చూసుకోవాలి తప్ప జర్నలిస్టులను అనడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. జర్నలిస్టులకు 24 గంటల్లో బేషరతుగా క్షమాపణ చెప్పని యెడల అన్ని జర్నలిస్టు సంఘాలు, మేధావులు, మహేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడుని సంప్రదించి రమాకాంత్ పై చర్యలకు పూనుకుంటామని హెచ్చరించారు. జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ నిత్యం ప్రజల సమస్యలను ప్రభుత్వాలకు ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తూ వాటి పరిష్కారంలో ముందుండే జర్నలిస్టులను అనరాన్ని మాటలు తప్పుగా మాట్లాడడం , నాగర్ కర్నూల్ మహేంద్ర సంఘం గ్రూప్ వాట్సాప్ లో పెట్టడం,సరైన పద్ధతి కాదని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. రమాకాంత్ బేషరతుగా జర్నలిస్టులకు జర్నలిస్టు కుటుంబాలకు క్షమాపణ చెప్పాలని లేదంటే నాగర్కర్నూల్ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలో చేపడతామని హెచ్చరించారు.