ఘనంగా "మిలద్ ఉన్ నబీ" వేడుకలు...
మహమ్మద్ ప్రవక్త ప్రవచించిన సూత్రాలను పాటించాలి...
- ప్రతి ఒక్కరూ శాంతి మార్గంలో నడవాలి...
కల్వకుర్తి, సెప్టెంబరు 5 (మనఊరు ప్రతినిధి): మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని శుక్రవారం కల్వకుర్తి మండలం మార్చాల గ్రామ ముస్లీంలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మస్జీద్ లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వ హించడంతో పాటు శాంతి యాత్రలు చేపట్టారు. చిన్నాపెద్దా అనే తేడాలేకుండా సాంప్రదాయ వస్త్రధారణతో శాంతియాత్రల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మత బోధకుడు మొహమ్మద్ అక్రమొద్దీన్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త ప్రపంచానికి శాంతి, సౌభ్రాతృత్వాలను సోదరభావాన్ని బోధించారని గుర్తు చేశారు. వారి మార్గంలో పయనిస్తూ ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోసం ప్రార్థించాలని సూచించారు. మహమ్మాద్ ప్రవక్త జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని సన్మార్గంలో నడుస్తూ వారి బోధనలు సార్థకం చేయాలని కోరారు.మజీద్‌లలో చిన్నారులు, పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ మహ్మద్ ప్రవక్తను స్మరించుకున్నారు.సర్వమతాల సారాంశం ఒక్కటేనని, సమాజంలో హిందూ ముస్లిం భాయ్ భాయ్‌గా జీవనం కొనసాగిస్తూ గంగా జమునా తెహజీబ్‌ను కాపాడుకొంటూ, మతసామరస్యంతో ముందుకు సాగాలన్నారు.అనంతరం ముస్లిం మైనారిటీ యువకుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ యువకులు పాల్గొన్నారు.