తిరుమలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

 తిరుమలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

తిరుమల, జనవరి 27 (మన ఊరు ప్రతినిధి): కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మంగళవారం తిరుమల తిరుపతి దేవస్థానంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ఆమనగల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బట్టు కిషన్ రెడ్డి, నాయకులు సూదిని కొండల్ రెడ్డి, తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, కసిరెడ్డి విజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక దర్శనంలో స్వామి వారిని దర్శించుకుని ఆలయంలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ శ్రీ శ్రీ కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలని, శాంతి సౌఖ్యాలతో జీవించాలని స్వామి వారిని వేడుకున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి నియోజకవర్గ ప్రజలపై స్వామి వారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని భగవంతుని ప్రార్థించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో పాటు హాజరైన నాయకులను శాలువాలతో సన్మానించి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Previous Post Next Post