అన్యాక్రాంతమైన భూదాన్ భూమి ప్రభుత్వ పరం..

 అన్యాక్రాంతమైన భూదాన్ భూమి ప్రభుత్వ పరం..




ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చర్యలు చేపట్టాలి

జడ్చర్ల రూరల్, మార్చి 1 (మనఊరు న్యూస్): జడ్చర్ల పట్టణం నడిబొడ్డున గల అన్యాక్రాంతమైన భూదాన్ భూమి తిరిగి ప్రభుత్వ పరమైంది. భూదాన్ భూమి తిరిగి ప్రభుత్వ పరం కావడంతో పట్టణ ప్రజల ఆకాంక్ష నెరవేరింది. జడ్చర్ల అసెంబ్లీ స్థానం తొలి శాసనసభ్యుడు జడ్చర్ల గాంధీగా పేరుగాంచిన కొత్త కేశవులు తన సొంత పట్టా భూమి 138లో గల 2.10 గుంటలను 1965 వ సంవత్సరం జడ్చర్ల భవిష్యత్ అవసరాల కోసం స్వచ్ఛందంగా భూదాన్ యజ్ఞ బోర్డ్ కు దానంగా ఇవ్వగా 2024 సంవత్సరంలో కొందరు వ్యక్తులు చట్టవ్యతిరేకంగా ఆ భూమికి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ తెచ్చుకొని ఇతరుల పేరున రిజిస్ట్రేషన్ చేశారు. అంతేకాక రిజిస్ట్రేషన్ తర్వాత నాలా కన్వర్షన్ కూడా చేశారు. భూదాన్ భూమి అన్యాక్రాంతం అవడం పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తం అయ్యాయి. అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులకు ఈ భూదాన్ భూమి అన్యాక్రాంతం ఎన్నికల నినాదంగా పనిచేసింది. భూధాన్ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని యావత్ పట్టణ ప్రజలు ఆకాంక్షించారు. అంతేకాక అందుకోసం పోరాటాలు కూడా చేశారు. ఆ సమయంలోనే అదే సర్వే నంబర్ లోని మిగతా 14.22 ఎకరాల భూమి ప్రోహిబిటెడ్ లో పడడంతో భూమి పట్టాదారులు సీసీఎన్ఏ కోర్టును ఆశ్రయించారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన సీసీఎల్ఎ కోర్టు రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా ఇతరులకు అమ్మినందుకు వారి హక్కులను రద్దు చేసి రెవెన్యూ రికార్డులలో భూమి పట్టాను తొలగించి ప్రభుత్వ భూమిగా నమోదు చేసి ఫిజికల్ పొజిషన్ ను స్వాధీనం చేసుకుని జడ్చర్ల ప్రజల అవసరాలకు ఆ భూమిని వాడుకోవాలని స్పష్టమైన తీర్పును ఇచ్చింది. అన్యాక్రాంతమైన కోట్లాది రూపాయల విలువ గల భూమి తిరిగి ప్రభుత్వ పరం కావడం పట్ల జడ్చర్లలో వ్యక్తమవుతున్నాయి. సర్వత్రా హర్షాతిరేకాలు 9 భూమిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించి భూదాత కొత్త కేశవులు ఆశయాన్ని నెరవేర్చాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Post a Comment

Previous Post Next Post