మీనాంబరం ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా

 సొంత నిధులతో సీసీ రోడ్డు ఏర్పాటు చేసిన బిజెపి రాష్ట్ర నాయకులు జనార్దన్ రెడ్డి

భక్తుల సౌకర్యార్థం ముందుకొచ్చిన జనార్దన్ రెడ్డి

జడ్చర్ల రూరల్, జనవరి 22 (మనఊరు ప్రతినిధి): మీనాంబరం పరిషవేదిశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని బిజెపి రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి అన్నారు. గురువారం జడ్చర్ల మండల పరిధిలోని మీనాంబరంలో గల శ్రీ పరిషవేదిశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ఆయన సమకూర్చిన నిధులతో సుమారు రూ.7 లక్షల సొంత నిధులతో 1400 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్, బైరంపల్లి సర్పంచ్ బొడ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ… గత సంవత్సరం శివపార్వతుల కల్యాణోత్సవానికి హాజరైన ముచ్చర్ల జనార్దన్ రెడ్డి దంపతులను ఆలయ కమిటీ సభ్యులు దేవాలయ ప్రాంగణంలో సీసీ రోడ్డు ఏర్పాటు చేయాలని కోరగా, వారు ఇచ్చిన మాట ప్రకారం నేడు రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయించారని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో సీసీ రోడ్డు వేయించడం పట్ల ఆలయ కమిటీ సభ్యులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం జనార్దన్ రెడ్డి పరిషవేదిశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సంప్రదాయ ప్రకారం ఆయనను కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు బైరంపల్లి సర్పంచ్ బొడ గోపాల్, కమిటీ సభ్యులు కొత్తపల్లి యాదయ్య, పుట్ట పర్వతాలు, పాచాలపల్లి మాజీ సర్పంచ్ నరసింహులు గౌడ్, బైరంపల్లి మాజీ సర్పంచ్ కడయ్యతో పాటు పలువురు భక్తులు, దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.



Previous Post Next Post