లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి
ఇక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి
లక్ష్మీ చెన్నకేశవస్వామి దేవాలయ అభివృద్ధికి సహకారం ఉంటుంది
టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి
మాడ్గుల, జనవరి 25 (మనఊరు ప్రతినిధి): మండల కేంద్రంలోని శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి వారి దేవాలయంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం ఘనంగా నిర్వహించిన స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఆయన, అనంతరం స్వామి వారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమం అనంతరం నిర్వహించిన సమావేశంలో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ లక్ష్మీ చెన్నకేశవస్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. అదేవిధంగా ఈ దేవాలయ అభివృద్ధికి తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. మొదటిసారిగా దేవాలయానికి విచ్చేసిన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డికి ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. దేవాలయ అభివృద్ధికి సహకారం అందిస్తానని హామీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయనను ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రజిత దేవయ్యగౌడ్, వార్డు సభ్యులు మద్దెల గణేష్, దార అనూష విష్ణు, మొగిల్ల కృష్ణ, యేరుకలి కాటం గౌడ్, ఎమ్మే శివలీల శేఖర్, నూనె పర్వతాలు, ఐక్యత ఫౌండేషన్ మాడ్గుల ఇంచార్జి జైపాల్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు చిక్కుడు జంగయ్య, దార రాములు, మద్దెల యాదయ్య, ఏనుక లక్ష్మణ్, చిక్కుడు శ్రీశైలం, చిక్కుడు కృష్ణయ్యతో పాటు భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



