ప్రతి ఒక్కరు సేవా దృక్పథం అలవర్చుకోవాలి

ప్రతి ఒక్కరు సేవా దృక్పథం అలవర్చుకోవాలి
జెకె ట్రస్ట్ చైర్మన్ వి. నరసింహచారి నవాబుపేట, మార్చి 2 (మనఊరు న్యూస్): ప్రతి ఒక్కరు సేవా దృక్పథం అలవర్చుకోవాలని జెకె ట్రస్ట్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వి. నరసింహచారి అన్నారు. ఆదివారం మండలకేంద్రంలో జెకె ట్రస్ట్ ఆధ్వర్యంలో మండల కేంద్రానికి ఆదివారం సంత (అంగడి) కొరకు చుట్టుముట్టు గ్రామాల నుంచి, తండాల నుంచి వచ్చే ప్రజల కొరకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం 26వ వారం విజయవంతంగా నిర్వహించారు. అలాగే ఉదయం 6 గంటలకు మండలంలోని ఫతేపూర్ మైసమ్మ దేవాలయం సమీపంలో ఉంటున్న వానర సమూహమునకు (కోతులకు) పండ్లు కూరగాయలు ఆహారముగా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ గ్రామాల నుంచి వారి అవసరాల నిమిత్తం మండల కేంద్రానికి వచ్చి ఎందరో ఆకలని ఓర్చుకోలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారిని చూసి తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జెకే ట్రస్ట్ డైరెక్టర్, మండల వ్యాపార సంఘం అధ్యక్షులు సుధాకర్ చారి, నవాబుపేట డెవలప్మెంట్ చైర్మన్ పుట్టి ఆంజనేయులు, వైస్ చైర్మన్ టంకర నిరంజన్, డైరెక్టర్ పుట్టి మహేష్ కుమార్, పుట్టి రాఘవేందర్, నాగలింగం, రఘు, నరేష్ కుమార్, కమ్మరి శ్రీకాంత్, కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post