అమ్మ కడుపులో...

 అమ్మ కడుపులో...

నవమాసాలు వెలసి 

మొదటిసారి జన్మించావు

నవ గ్రహ పరిసర నింగిలో

తొమ్మిది నెలలు మెలసి

పునర్జన్మించావు

నేనెరిగి ఈ నేలపై

రెండుమార్లు విరిసిన

ధన్య జీవివమ్మా.. 

అబలలను సైతం 

సబలలుగా నిలిపే..

స్ఫూర్తిదాతవమ్మా! 

నీకు వేవేల వందనాలమ్మా...

మా సునీతమ్మా...!


                 రచయిత 

    డా .ప్రియ నితిన్ మహింద్రకర్

Previous Post Next Post