అత్యంత శక్తివంతురాలు సునీత విలియమ్స్..
ఆమె సాహసం ఆదర్శప్రాయము అని కొనియాడిన మాస్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ పత్తిపాటి లక్ష్మీకాంతమ్మ హర్షం
ఖమ్మం, మార్చి 22 (మనఊరు న్యూస్): అంతరిక్ష ప్రయాణం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన అత్యంత శక్తివంతురాలు సునీత విలియమ్స్ అని, ఆమె జీవితం ప్రపంచంలోకానికి ఒక ఆదర్శప్రాయమని మాస్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్, మానవ హక్కుల పరిరక్షణ కమిటీ కార్యదర్శి పత్తిపాటి లక్ష్మీకాంతమ్మ అభిప్రాయపడ్డారు. శనివారం ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. సృష్టిలో మహిళ ఎంతో గొప్ప శక్తివంతురాలని, సృష్టికి మూల కారణం మహిళ అని కొనియాడారు. మరణానికి భయపడకుండా మహిళా శక్తిని చాటి చెప్పి న ఆ గొప్ప మహిళ సునీతా విలియమ్స్ అని పేర్కొన్నారు. 9నెలలు అంత రిక్షములో నివసించి మరల క్షేమంగా భూమిని చేరుకున్నారంటే మాములు విషయం కాదన్నారు. మహిళ తలిస్తే మనుగడ మార్చ గలదని సునీత విలియమ్స్ మరో మారు నిరూపించారని గుర్తు చేశారు. భారతీయ సంస్కృతికి, నాసా హయోమగామి సునీతా విలియమ్స్ సురక్షి తంగా భూమిమీదకి వచ్చినందుకి తమ ఎన్జీవో సమస్త ద్వారా ఎంతో గర్విస్తున్నామని తెలిపారు. మహిళా లోకానికి వన్నె తెచ్చిన ఆగొప్ప స్త్రీ ని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ఆమె అన్నారు.


