విద్యుత్ దుర్వినియోగాన్ని అరికట్టాలి
చర్లపల్లి గ్రామస్తులు డిమాండ్స్
వెంటనే ఆన్ ఆఫ్ స్విచ్ ఏర్పాటు చేయాలి
జడ్చర్ల రూరల్, మార్చి 15 (మనఊరు న్యూస్): జడ్చర్ల మండలంలోని చర్లపల్లి గ్రామంలో చీకటి మటున వెలగల్చిన వీధిలైట్లు పట్ట పగలైనా మిట్ట మధ్యాహ్నం పూట కూడా కనీసం లైట్లు ఆన్ ఆఫ్ స్విచ్ లేకపోవడం వల్ల విద్యుత్తు వృధా చేస్తున్న సంఘటన చర్లపల్లి గ్రామంలో తలపిస్తుంది. కొన్ని గ్రామాల్లో రాత్రిపూట వెలగవలసిన లైట్లు కూడా అసలు లైట్లే లేకపోవడంపై గ్రామాల్లో ప్రజలు నిరుత్సాహంతో ఉంటే చర్లపల్లి గ్రామంలో మాత్రం ఎటువంటి రక్షణ లేకుండా నిరంతరం వెలుగుతూనే దర్శనమిస్తున్నాయి, పట్ట పగలైనా నిరంతరం వీధిలైట్లు వెలగడంపై గ్రామస్తులు త్వరగా పాడైతాయి అదే కాక విద్యుత్ దుర్వినియోగం అవుతుందని అగ్రహానికి గురవుతున్నారు. సంబంధిత గ్రామపంచాయతీ సెక్రెటరీ నవీన్ కుమార్. కనీస చర్యలు తీసుకోకపోవడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సంబంధిత శాఖ వారికి కనీస తగినంత మెటీరియల్స్ ను సప్లై చేయలేదని దానివల్ల సూటిగా వేలాడ దించామని పంచాయతీ సిబ్బంది తెలుపుతున్నారు. ఈ దుర్వినియోగంపై పలువురు గ్రామస్తులు నుంచి విమర్శలు వస్తున్నాయి. పంచాయతీ సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విద్యుత్ దుర్వినియోగంపై సంబంధిత అధికారులు చొరవ తీసుకొని ఎలాంటి ఆగడాలను అరికట్టి విద్యుత్తును ఆదా చేయాలని చర్లపల్లి గ్రామస్తులు కోరుతున్నారు.

