కల్లుగీత కార్పొరేషన్ సంస్థకు నీరాకేఫ్ బదిలీ
ప్రభుత్వ పెద్దలకు నీరాభిషేకం
హైదరాబాద్ మార్చి 15 ( మన ఊరు న్యూస్): తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని గౌడ కులస్తుల సంక్షేమం కోసం ఒక సంచలనం నిర్ణయం తీసుకోవడం గర్వకారణమని కల్లుగీత కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగరాజు గౌడ్, కల్లుగీతా పారిశ్రామిక సంఘం నాయకులు వనపర్తి జిల్లా అధ్యక్షులు మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు శ్రీనివాస్ గౌడ్, అన్నారు, ఎంతోకాలంగా నీరా కేఫ్ వల్ల గౌడ కులస్తులు గతంలో టూరిజం శాఖ పరిధిలో ఉన్న నీరా కేఫ్ ను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటినుంచి బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని తెలంగాణ కళ్ళు గీత సహకార సంఘం కు బదిలీ చేయడం పట్ల శనివారం హైదరాబాదులోని నీరా కేఫ్ ట్యాంక్ బండ్ దగ్గర రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మన మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మధుయాష్కి గౌడ్ తో పాటు తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చిత్రపటానికి నీరాభిషేకం చేశారు, ఈ సందర్భంగా గీత కార్మిక గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు నాగరాజ్ గౌడ్ , బండారు శ్రీనివాస్ గౌడ్, మాట్లాడుతూ నీరా లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని ఈ నీరా వల్ల అనేక రోగాలు నయం అవుతాయని అన్నారు, గ్రామీణ ప్రాంతాలలో లభించే ఎన్నో ఔషధ గుణాలు కలిగిన నీరా చెట్లనుంచి కలు తీసే మొదటి దశనే నీరా అన్నారు, గీత కార్పొరేషన్ సంస్థకు మీరా కేఫ్ భవనాన్ని అప్పజెప్పాలని గౌడ సంఘాల ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేయడం వల్లనే ఎట్టకేలకు టూరిజం శాఖ పరిధిలో ఉన్న నీరా కేఫ్ బీసీ సంక్షేమ శాఖ తెలంగాణ గీతా సహకార సంఘం కు బదిలీ చేసిందని అన్నారు, అంతే కదా 20 కోట్ల బడ్జెట్ కేటాయించి నీరా కేఫ్ భవనం నిర్మించి గౌడ కులస్తులకు ఆర్థిక శ్రేణి ఇవ్వడం కోసం ఏర్పాటు చేసిన దానిని ప్రభుత్వం టూరిజం శాఖ వారు వ్యాపార లావాదేవీలు చేసుకోవడం తప్ప గౌడ కులస్తులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని ఈ విషయంపై రాష్ట్రస్థాయిలోనే వివిధ గౌడ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి ఆలోచన విధానంతో టూరిజం శాఖ నుంచి నీరా కేఫ్ ను ఎత్తివేస్తూ తెలంగాణ గీత పారిశ్రామిక సహకార సంఘంలో చేర్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్రవ్యాప్తంగా కల్లు గీతా పారిశ్రామిక సహకార సంఘాలతో పాటు వివిధ సంఘాల నాయకుల లో ఆనందం వెల్లువిరుస్తుందని అన్నారు, అందుకే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఎంతోమంది గౌడ సోదరులకు న్యాయం జరుగుతుందని ప్రభుత్వం భావించి తీసుకున్న నిర్ణయం అభినందనీయమని గౌడ సంఘం రాష్ట్ర నాయకులు నాగరాజ్ గౌడ్, వనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు శ్రీనివాస్ గౌడ్, నాగవరం మధుసూదన్ గౌడ్, నరేందర్ గౌడ్ తదితరులు ఆనందం వ్యక్తం చేశారు.
