విద్యార్థులకు లస్సీ మజ్జిగ పంపిణీ
చిలకలూరిపేట, ఏప్రిల్ 19 (మనఊరు ప్రతినిధి): జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో మున్సిపల్ ప్రైమరీ విద్యార్థులకు లస్సీ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజము, జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం రాగన్నపాలెంలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు వేసవికాలం సందర్భంగా మజ్జిగ లస్సి పంపిణీ చేయడం జరిగింది. ఎండాకాలం విద్యార్థులకు దాహార్తిని తీర్చడానికి లస్సి పంపిణీ చేశామని, పిల్లలు ఆరోగ్యంగా ఉత్సాహంగా ఎండ తీవ్రతను తట్టుకోవడానికి మజ్జిగ దివ్య ఔషధం అని ట్రస్టు ప్రెసిడెంట్ డాక్టర్ పూసపాటి బాలాజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో విసీ కే పార్టీ జిల్లా ఇన్చార్జి వంజా ముత్తయ్య పాల్గొని, విద్యార్థులకు మజ్జిగ లస్సి అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు కనుమర్లపూడి నాగేశ్వరరావు, స్కూల్ ఉపాధ్యాయురాలు రత్న, మంజరి, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.