సాధారణ ప్రసవంలో 4.1 కిలోల నవజాత శిశువు జననం

 సాధారణ ప్రసవంలో 4.1 కిలోల నవజాత శిశువు జననం

ప్రభుత్వ సాధన ఆసుపత్రిలో ప్రతిరోజు ప్రసవాలు

గర్భిణీలకు స్కానింగ్ సౌకర్యం వసతి ఏర్పాటు

గైనకాలజి వైద్యులను సిబ్బందిని అభినందించిన మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ టి.ఉషారాణి




నాగర్ కర్నూల్, జులై 16 (మనఊరు ప్రతినిధి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో బుధవారం నాడు ఖమ్మం జిల్లాకు చెందిన ప్రియాంక కు పురిటి నొప్పులు రావడంతో ఆసుపత్రికి వచ్చారు. ఆమెకు స్త్రీ వైద్య నిపుణులు సంబంధిత నర్సింగ్ సిబ్బంది చికిత్సలు అందించగా మొదటి ప్రసవంలో 4.1 కిలోల బరువు గల నవజాత శిశువు జన్మించింది. ప్రసవానంతరం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా సాధారణ ప్రసవంలో అధిక బరువు గల శిశువు జన్మించడంతో గైనకాలజీ వైద్యులను సిబ్బందిని మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ టి ఉషారాణి అభినందించారు. అనంతరం శిశువును తల్లికి అప్పగించారు. ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో ప్రతిరోజు 12 నుంచి 15 వరకు ప్రసవాలు జరుగుతున్నట్లు తెలిపారు. గర్భిణీలకు స్త్రీ వైద్య నిపుణులు ప్రత్యేకంగా సోమవారం నుంచి శనివారం వరకు గది నెంబర్ 21 లో ప్రతిరోజు సాధారణ పరీక్షలు జరుపుతున్నారని తెలిపారు. ఇటీవల గర్భవతులకు స్కానింగ్ సౌకర్యం వసతి ఏర్పాటు చేశామని అన్నారు. గర్భిణీలకు తెలంగాణ డయాగ్నస్టిక్ ద్వారా అన్ని రకాల మూత్ర, రక్త పరీక్షలు వారికి చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతానికి చెందిన ప్రతి గర్భిణి ఆసుపత్రిలోనే సుఖప్రాసనం జరుపుకోవాలని ఆమె సూచించారు. గర్భవతులకు సహకారిగా హెల్ప్ డెస్క్ సేవలను పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్త్రీ వైద్య నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ నీలిమ, డాక్టర్ సుప్రియ, డాక్టర్ కే. నికితరెడ్డి, డాక్టర్ డి.ఝాన్సీ, డాక్టర్ ఎస్ ప్రవళిక, డాక్టర్ ప్రవీణ్ కుమార్, నర్సింగ్ ఆఫీసర్లు మిడ్ వైఫ్స్, సిబ్బంది కే లక్ష్మమ్మ, రేవతి, ప్రసన్న, సువేద, రేణుక, రాధ, శ్రావణి హెల్ప్ డెస్క్ ఇంచార్జ్ టి. యాదగిరి, సుజాత, తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post