*ఉద్యోగులు ప్రజల మన్ననలు పొందాలి*
*_ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు తాండ్ర శ్రావణ్ రెడ్డి*
కేశంపేట, మే 15 (మనఊరు ప్రతినిధి): ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల మన్ననలు పొందుతూ విధి నిర్వహణలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు తాండ్ర శ్రావణ్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పశుసంవర్ధక శాఖలో ఖాళీలను భర్తీ ప్రక్రియ నిర్వహించిందన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సహకారంతో మండలంలోని ఏ ఎక్లాస్ ఖాన్ పేట, కొండారెడ్డి పల్లి, పాపిరెడ్డి గూడ గ్రామాల్లో ఉన్న పశు వైద్య ఉప కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వం సిబ్బంది నియమించిందని ఆయన అన్నారు. పాపిరెడ్డి గూడ గ్రామంలో ఉన్న పశు వైద్య ఉప కేంద్రంలో గురువారం లైవ్ స్టాక్ అసిస్టెంట్ గా స్వప్న విధుల్లో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర తాండ్ర శ్రావణ్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ... రైతులకు అందుబాటులో ఉండాలన్నారు. విధి నిర్వహణలో అవినీతికి ఆస్కారం లేకుండా ఉపకేంద్రం పరిధిలోని గ్రామాలలో పాడి రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని ఆయన అన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం, రైతుల కోసం కృషి చేస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పశు వైద్య సిబ్బందిని కేటాయించేందుకు కృషి చేశారని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో శివయ్య, అబ్బి సుందరయ్య, యాదయ్య, కాంగ్రెస్ పార్టీ మహిళా కమిటీ మండల అధ్యక్షురాలు రాణి, రవీందర్, ఆంజనేయులు, సత్యం గౌడ్, రామస్వామి, రామచందర్, బిక్షపతి, కృష్ణయ్య, శ్రీను, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.