కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల కోట్ల సబ్సిడీ రూపంలో పెట్టుబడిదారులకు దోచిపెడుతుంది
సమ్మె విజయవంతం కోసం జరిగిన సదస్సు*
హైదరాబాద్, మే 14 (మగనూరు జిల్లాప్రతినిధి): కేంద్ర ప్రభుత్వాలనునాడు కాంగ్రెస్, నేడు బీజేపీ అంబానీ, ఆదానీ లాంటి ఆధిపత్య స్వదేశీ పెట్టుబడిదారులతో పాటు, వందల సంఖ్యలో అమెరికన్ సామ్రాజ్యవాద, దాని మిత్ర విదేశీ పెట్టుబటిదారులకు దేశ సంపదను దోచి పెడుతున్నాయని బహుజన వామపక్షం కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ఎండగట్టారు. హైదరాబాద్ లోని, ఓంకార్ భవన్ లో బుధవారం రోజు ఎస్. సిద్దిరాములు అధ్యక్షతన 20న జరిగే భారత కార్మిక సార్వత్రిక సమ్మె విజయవంతం కోసం సదస్సు జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 90 శాతం ఉన్న బహుజన శ్రామిక వర్గానికి, సమకాలీన సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన ప్రస్తుత కార్మిక కార్మిక నేతలు తప్పు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగం కల్పించిన కార్మిక రక్షణ చట్టాలను కాలరాస్తున్నదని. దేశ సంపద సృష్టికర్తలైన బహుజన కార్మికుల శ్రమను వినియోగించుకున్నారు. ఆదిపత్య వర్గ ప్రతినిధుల పెట్టుబడిదారులకు లక్షల కోట్ల రూపాయల సబ్సిడీల రూపంలో దోచిపెడుతోంది. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనం 26 వేల అమలు చేయడానికి ఇచ్చిన తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు. అయినా సరే బిజెపి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును బుట్ట దాఖలు చేస్తున్నట్లు ఆగ్రహించారు. అందుకే బిజెపి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న బహుజన శ్రామిక వర్గ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ మే 20 న కేంద్ర, రాష్ట్ర స్థాయి కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో, బహుజన వామపక్ష కార్మిక సంఘాల జేఏసీ కార్మిక వర్గానికి కనీస వేతనం 30 వేలు, ఈపీఎఫ్ పెన్షన్ 15 వేలు అమలు, బహుజన కార్మిక వర్గానికి వ్యతిరేకంగా బిజెపి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 20 న జరిగే సార్వత్రిక సమ్మెలో బహుజన కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసేందుకు బి.ఎల్.టి. దండివెంకట్, ఎస్.సిద్దిరాములు, టి.ఎస్.కె.పి.ఎస్.మైలారం జంగయ్య, గ్యార సాలయ్య, టి.ఎఫ్.టి.యు. యాదగిరి, ఎస్.ఎం.ఖలీల్, కె.ఎం.పి.ఎస్. శాంతి చర్చల చంద్రన్న కె.చంద్రశేఖర్ ప్రసాద్, ఎస్.ప్రబాకర్, టి.వి.వి.వి. ఎం.వెంకటయ్య, ఏ.ఐ.సి.టి.యు. అనిల్, కె.దనయ్య, ఎన్.ఎస్.ఎస్. ఫిరోజ్, పి.యు.కె.యు.డోలక్ యాదగిరి, ఇఫ్టూ షేక్ షావలి, పిఓడబ్ల్యూ(విముక్తి) పి.సునీత, టి.యు.సి.టి. డి.రాజేష్, టి.యు.సి.ఐ. ఎం.డి.ఖాసీమ్, ఏ.ఐ.ఎఫ్.టి.యు. వై మల్లేష్, యాకన్న, బీసీ సంఘం జనార్దన్ కారణంగా బహుజన శ్రామికులకు విజ్ఞాపన చేశారు. తెలంగాణ ఉద్యమ జేఏసీ నాయకులు ఏ. యాదగిరి అధ్యక్షతన ఆలపించిన గేయాలు సభికులను ఉత్తేజపరిచి, ఆలోచింపజేశాయి. సభ అనంతరం నాలుగు లేబర్ కోడ్‌లు రద్దు, కనీస వేతనం 30 వేలు అమలు, ఈపీఎఫ్ పెన్షన్ 15 వేలు అమలు, బీడీ పరిశ్రమపై కేంద్రం విధించిన ఆంక్షలు ఎత్తివేసి, ప్రత్యేకమైన ఉపాధి కల్పించే వరకు కోప్టా 2013 చట్టాన్ని అమలు చేయకూడదని, మున్సిపల్, గ్రామ పంచాయితీ కార్మికులకు అనుమతినిచ్చింది, ఈ లోపు కనీస వేతనం 30 వేలు రూపాయిలు అమలు, విధి నిర్వహణలో మృతి చెందితే సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఢిల్లీ తరహాలో 30 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, ఇతర భవనాలు నిర్మాణ కార్మికులు విధి నిర్వహణలో మృతి చెందితే 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కల్పించాలని, అసంఘటిత కార్మికులకు సమగ్ర రక్షణ చట్టం రూపొందించి, పదివేల రూపాయల పెన్షన్ కల్పించాలని, అన్ని ప్రభుత్వ శాఖల్లో అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని,ఈ లోపు కనీస వేతనం 26 రూపాయలు అమలు చేయాలి, హమాలీ, రవాణా, గిగ్ (ప్లాట్ ఫామ్)తదితర అసంఘటితరంగా కార్మికుల సమగ్ర చట్టం చేయాలి, అసంఘటిత కార్మికుల ఐదు చట్టబద్ధమైన సామాజిక భద్రత కల్పించాలని, విద్యుత్ సవరణ చట్టం 2022ను రద్దు చేసి, స్వామినాథన్ కమీషన్ నిబంధనలను అమలు చేయడం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో ప్రతి వ్యక్తికి జాబు కార్డు రోజుల ఏర్పాటు చేసి, 200 పని దినాలు కల్పించాలని, చట్టంలో పొందుపరిచిన రాజీలేని అంశాలను అమలు చేయడం, గృహ హక్కులు చట్టాన్ని అమలు చేసి, నూతన జాతీయ విద్యా విధానం 2020 ను రద్దు చేయడం మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని విజయవంతం చేయడం పలు తీర్మానాలు సభికుల హర్షాధ్వనుల మద్య ప్రవేశపెట్టారు.