విద్యార్థుల్లో సంస్కృతిక, నైతిక విలువలతో పాటు క్రమశిక్షణ అవసరం మునిసిపల్ చైర్ పర్సన్ కోనేటి పుష్పలత

 విద్యార్థుల్లో సంస్కృతిక, నైతిక విలువలతో పాటు క్రమశిక్షణ అవసరం 

మునిసిపల్ చైర్ పర్సన్ కోనేటి పుష్పలత

జడ్చర్ల రూరల్, మే 5 (మనఊరు ప్రతినిధి): విద్యార్థుల్లో సంస్కృతిక, నైతిక విలువలతో పాటు ఈ విద్యను అభ్యసించడం వల్ల క్రమశిక్షణ, ఆదర్శంగా ఎదగడానికి అవకాశం ఉందనీ మునిసిపల్ చైర్ పర్సన్ కోనేటి పుష్పలత సూచిస్తోంది. పట్టణంలోని దయానంద మందిర్ విద్యాలయంలో సోమవారం వైదిక బాలుర యువశక్తి నిర్మాణ శిక్షణ శిబిరంను ఆర్య సమాజం, దయానంద విద్యాలయ మందిరం జడ్చర్ల ఆధ్వర్యంలో 5వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు వేసవి శిక్షణ శిబిరాన్ని పురపాలిక చైర్ పర్సన్ కోనేటి పుష్పలత జ్యోతి ప్రజ్వలన చేసి. ఈ శిబిరములో నైతిక విలువలు, మహాపురుషుల జీవిత చరిత్రలు, సంధ్య, దైవజ్ఞం, దేశభక్తి, దైవభక్తి, వేద మంత్రోచ్ఛారణ, కరాటే, ఆటలు, సాంస్కృతిక అంశాలు నేర్పిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో విద్యతోపాటు సామాజిక అంశాలు అభ్యసిస్తే విద్యతోపాటు ధర్మము న్యాయము, విలువలు, దేశభక్తిని దైవభక్తిని అభ్యసిస్తూ ఆచరణతో ఉన్నత స్థాయి విద్యను అభ్యసించే అవకాశం ఉందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో సంగీత నాటక అకాడమీ మాజీ ఛైర్మన్ బాదిమి శివకుమార్, ఆచార్యులు బాణాల ప్రభాకర్, ప్రణవమునిదర్, వేద ధర్మ ముని నరసయ్య, కరుణాకర్ సింగ్, నిర్వహించారు. వరకు.

Post a Comment

Previous Post Next Post