త్వరలోనే జర్నలిస్టుల సమస్యలకు లైన్ క్లియర్
నూతన అక్రిడేషన్ కార్డులకు మార్గం సుగమం
జర్నలిస్టుల సంక్షేమం కోసం (ఐజేయు) నిరంతర కృషి
జర్నలిస్టులకు భరోసా బాధ్యత (ఐజేయు) కే సాధ్యం
టియుడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి గుండ్రాతి మధు గౌడ్
మహబూబునగర్, మే 11 (మనఊరు ప్రతినిధి): తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపిస్తూ ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్నా నూతన అక్రిడేషన్ కార్డులు, ఇండ్ల స్థలాలు గృహ నిర్మాణం వంటి పథకాలలో అవకాశం కల్పించే విధంగా కృషి చేస్తామని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఐజేయు) రాష్ట్ర కార్యదర్శి గుండ్రాతి మధు గౌడ్ అన్నారు. ఇటీవల ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాసత్ అలీ ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణ తో కూడిన బృందం రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో జర్నలిస్టుల సమస్యలపై చర్చించడం జరిగిందని ఇందుకోసం ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కారణాల తో మరణించిన ప్రమాదాలలో భయపడ్డా జర్నలిస్టు కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం వితలవారీగా జర్నలిస్టుల సంక్షేమ నిధి కింద ప్రభుత్వాలు విడుదల చేసిన నిధుల ద్వారా బ్యాంకు నుంచి వడ్డీని 22 కోట్ల రూపాయలు జర్నలిస్టు సంక్షేమానికి ఖర్చు పెట్టడం జరిగిందని ఆయన వివరించారు. విధి నిర్వహణలో ప్రాణాలు లెక్క చేయకుండా ప్రజల కోసం ప్రభుత్వం కోసం పరితపిస్తూ జర్నలిస్టుల వృత్తిలో కొనసాగుతూ మరణించడం వల్ల జర్నలిస్టుల కుటుంబాలు వీధిన పడకుండా ఐజేయు యూనియన్ ఆదుకుంటుందని ఆయన అన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 38 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఏక మొత్తంలో ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడమే కాక ప్రతినెల 3000 రూపాయల పెన్షన్ సౌకర్యాన్ని ఐదు సంవత్సరాలపాటు చెల్లించేందుకు నిర్ణయం తీసుకోవడం గర్వించదగ్గ విషయం అని అన్నారు. అంతేకాక జర్నలిస్టు పిల్లలకు పాఠశాలలో చదువుల నిమిత్తం ప్రతినెల 1000 రూపాయల చొప్పున గరిష్టంగా ఇద్దరి పిల్లలకు ట్యూషన్ ఫీజు కింద ఆర్థిక సహాయం చేస్తున్నామని తెలిపారు. నమ్ముకున్న వృత్తికి న్యాయం చేయట కోసం జీవితాలను అంకితం చేస్తూ ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల సంక్షేమం పట్ల జర్నలిస్టుల సమస్యల పట్ల తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలల కాలం గడిచిన ఇప్పటికీ అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని ఈ విషయాన్ని రాష్ట్ర రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకుపోవడం జరిగిందని ఆయన వివరించారు. అంతేకాక గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీ మేరకు మేనిఫెస్టో పెట్టిన జర్నలిస్టులపై దాడులను నివారించేందుకు హై పవర్ కమిటీ ఏర్పాటు చేయాలని వెల్ఫేర్ ఫండ్ కమిటీ తో పాటు వెజ్ బోర్డు సిఫారసులను పర్యవేక్షించే త్రైమాక్షగా కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం రాజీలేని పోరాటాలు చేస్తూ జర్నలిస్టులకు గుండె ధైర్యం నింపడంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ముందంజలో ఉందని ఆయన అన్నారు. అతిపెద్ద జర్నలిస్టు యూనియన్ గా సభ్యత్వాలు కలిగిన టియుడబ్ల్యూజే రోజురోజుకు అంచలంచలుగా ఎదుగుతూ తిరుగులేని అతిపెద్ద జర్నలిస్టు యూనియన్ గా అవతరించిందని ప్రతి ఒక్కరి సహకారం అలా కృషి వల్ల యూనియన్ అనేక విజయాలను సాధించిందని ఆయన వివరించారు. జర్నలిస్టుల సంక్షేమంతో పాటు జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరాల పేరుతో నాణ్యమైన వైద్యం అందిస్తున్నామని వివిధ రకాల క్రీడా పోటీలు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 12 మంది జర్నలిస్టులు వివిధ కారణాలతో మరణించిన కుటుంబాలను ఆదుకోవడం జరిగిందని ఆయన వివరించారు.రాబోయే రోజుల్లో ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని నాగర్ కర్నూల్. వనపర్తి. నారాయణపేట
జిల్లాలలో మొదటి విడత లో ఉచిత శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ తర్వాత రెండో విడతలో మహబూబ్ నగర్.గద్వాల జిల్లాలలో శిక్షణ శిబిరాలను జర్నలిస్టులకు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ అవకాశాన్ని ఉమ్మడి జిల్లాలోని జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా టియుడబ్ల్యూ జె యూనియన్ లో సభ్యత్వాలు ఊహించిన విధంగా జరిగాయని తొందరలోనే జిల్లాస్థాయి యూనియన్ కమిటీలను ఏర్పాటు చేయుటకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జర్నలిస్టు యూనియన్ ముసుగులో అవినీతి అక్రమాలకు పాల్పడిన వ్యక్తులకు ఐజేయు యూనియన్ లో చోటు తగ్గదని జర్నలిస్టులు వృత్తి పవిత్రమైన వృత్తిగా ప్రతి ఒక్కరు భావించి క్రమశిక్షణ కలిగిన జర్నలిస్టులకు మాత్రమే టియు డబ్ల్యూజె లో చోటు దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. కొంతమంది చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఆయన తిప్పి కొట్టారు. అలివిగాక యూనియన్ పేరు చెప్పుకొని అడ్డగోలుగా ప్రవర్తిస్తే సహించేదే లేదని ఆయన హెచ్చరించారు.