ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోండి
జడ్చర్ల రూరల్, మే 11 (మనఊరు ప్రతినిధి): వైద్యం నేడు చాలా ఖరీదైందని శ్రీకృష్ణ సూపర్ స్పెషాలిటీ క్లినిక్, బిగ్ టివి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉచిత వైద్యసేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని శ్రీ సూపర్‌కృష్ణ స్పెషాలిటీ క్లినిక్ ఆవరణలో ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంపును స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు మనం తీసుకునే ఆహారం, వాతావరణంలో వస్తున్న మార్పులు, ఇతర కాలుష్యాల వల్ల ప్రతి ఒక్కరు అనారోగ్యం బారిన పడుతున్నారు, ఇలాంటి పరిస్థితిలో ఆరోగ్యం పట్ల నిర్లక్షం వద్దు, ప్రతిఒక్కరూ వైద్య పరీక్షలు చేసుకొని ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని, ఆరోగ్య సంబంధిత సమస్యలను దూరం చేసుకోవాలన్నారు. డాక్టర్లు మాట్లాడుతూ ఈ ఉచిత వైద్య శిబిరం లో 139 మంది వైద్య సేవలను వినియోగించుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల మున్సిపల్ చైర్ పర్సన్ కోనేటి పుష్పలత, కౌన్సిలర్లు రమేష్, చైతన్యచౌహన్ నాయకులు పాలాది రామ్మోహన్, వైద్యులు, నాయకులు, నిర్వహించారు.