క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి..

 క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి..

వేసవి ఉచిత క్రికెట్ శిక్షణను ప్రారంభించిన

 రాజశేఖర్   

జడ్చర్ల రూరల్, మే 11(మన ఊరు న్యూస్): క్రీడలు మానసిక ఉల్లాసానికి పెంపొందించడమే కాక మనిషికి, మనిషికి మధ్య ప్రేమానురాగాలు పెంచుతాయని డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ అన్నారు. జడ్చర్ల మినీ స్టేడియంలో నిర్వహించే ఉచిత క్రికెట్ శిక్షణను ప్రతి ఒక్కరు చిన్నారులు ఉపయోగించుకోవాలని మహబూబ్ నగర్. క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యం లో జడ్చెర్ల మినీ స్టేడియం లో నిర్వహిస్తున్న ఉచిత వేసవి క్రికెట్ శిక్షణ శిబిరానికి డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ ఆదివారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి శిక్షణ శిబిరానికి అవసరం అయిన క్రికెట్ సామగ్రిని అందించారు. ఈ శిక్షణా శిభిరం జూన్ 10 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. HCA గత 2 సంవత్సరాలుగా జిల్లా స్థాయిలలో వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు జడ్చర్ల మినీ స్టేడియం లో 150 చిన్నారి క్రీడాకారులు రోజు తర్ఫీదు పొంది రాబోయే రోజులలో ప్రతిభను కనబర్చాలని అతిథులు ఆకాంచించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మెన్ ప్రభాకర్ రెడ్డి, ఫ్లైవాచ్ అసోసిషన్ అధ్యక్షులు కాల్వ రాంరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అశోక్ యాదవ్, కౌన్సిలర్ ఉమా శంకర్, క్రికెట్ ప్రతినిధులు శ్రీహరి కుమార్, ముజీబ్ ,, అన్సారీ,వ్యాయామ ఉపాధ్యాయులు రాములు, శంకర్ నాయక్, మెయిన్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post