నడి రోడ్డుపై కొట్టు మిట్టాడుతున్న వ్యక్తిని కాపాడిన ములుగు దేవత మంత్రి సీతక్క
ములుగు, మే 30 (మనఊరు ప్రతినిధి): అడవి తల్లి వేగుచుక్కవై, ఆయుధాల జమ్మి చెట్టువై, ఉద్యమాల పోరు జండగా.. గోసపడే గరీబ్ గుడిసెల వెలిగిన దీపమై, తల్లడిల్లిన ఆకలి గుండెకు ఆసరగా నిలిచావు. కల తిరిగిన కాళ్ళను ఏ చోట అగనివ్వకా..., కాలం ఏదైనా మధురమైన పలకరింపుతో ఎదురు ఎవడున్నా తడబడకుండా..., ఎంచుకున్న ప్రజల బాటలో.. సంకల్పం వీడని నేస్తంతో, సందేశం పలికే మాటలతో, పేదోళ్ల దిక్కుగా, ఐనోల్ల హక్కుగా.. అందరి మనిషి గా వున్న సీతక్క గారు మంత్రి హోదాలో ఉన్నపటికీ పిడుసు వచ్చి నడి రోడ్డులో కొట్టు మిట్టాడుతున్న వ్యక్తిని చూసి చలించిపోయిన ఆమె తక్షణమే సిబ్బందిని అప్రమత్తం చేసి ఒక మాజీ నక్సలైట్ కమాండర్ విధులు నిర్వహించిన గత జీవితాన్ని నెమరు వేసుకుని స్వయంగా సహాయ చర్యలు చేపట్టారు. అలాగే బాధితుడు కోలుకునే వరకు అక్కడే ఉండి హాస్పిటల్ కు పంపడం జరిగింది అంటే సీతక్క గారికి ప్రజలన్న, ప్రజా సేవ అన్న ఎంత మక్కువో చెప్పనక్కర లేదు. మంత్రి హోదాలో ఉంటూ మాటల్లో కాకుండా చేతల్లో చూపించిన ఆమె సేవను సోషల్ మీడియా వేదికగా నెటిజెన్లు జే జే లు పలుకుతున్నారు.