*పేద ప్రజల ఆకలి తీర్చేందుకే సన్నబియ్యం పంపిణీ - షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్*
షాద్ నగర్, మే 11 )(మనఊరు ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం పేదల కడుపు నింపాలనే ఉద్దేశంతో తీసుకువచ్చిన సన్న బియ్యం పథకం ఎంతో చేయూత ఇస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు అన్నారు. నందిగామ మండలంలోని వెంకమ్మ గూడ గ్రామంలో చిర్ర నర్సింహులు ఇంట్లో భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ...ధనికులతో సమానంగా పేదలకు కూడా సన్న బియ్యం అందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. సన్న బియ్యం పంపిణీ చరిత్రాత్మక నిర్ణయం అని అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందులో ఇండ్లు, రేషన్ కార్డులు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలోమండల మాజీ ఎంపీపీ ఎం శివశంకర్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగ నరసింహులు, మాజీ సర్పంచ్ రజనిత, వీరేందర్ గౌడ్, మాజీ ఎంపిటిసిలు కొమ్ము కృష్ణ, దేపల్లె కుమార్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు పసుల బుచ్చయ్య, ఎం అంజo కుమార్ గౌడ్, సాములయ్య, కాంగ్రెస్ అధ్యక్షుడు వడ్డే శీను, గుండాల వేణు, రాజశేఖర్, దేవేందర్, వడ్డే కృష్ణ,ఆవుల శివ తదితరులు పాల్గొన్నారు.