దేశ సైనికుల ధైర్యం క్రమశిక్షణ యువత సైనికులను స్ఫూర్తిగా తీసుకోవాలి
తెలంగాణ రాష్ట్ర సిఎస్‌సి కోర్టు సీనియర్ సూపరింటెండెంట్ పివిపి అంజనీ కుమారి
చిన్న తిరుపతి, మే 11 (మనఊరు ప్రతినిధి): దేశ సైనికుల ధైర్యం క్రమశిక్షణ యువత సైనికులను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ రాష్ట్ర సిఎస్‌సి కోర్టు సీనియర్ సూపరింటెండెంట్ పివిపి అంజనీ కుమారి అన్నారు. ఆదివారం హెల్ప్ ఫౌండేషన్ (సత్తెనపల్లి)ఆధ్వర్యంలో శనివారం ఉదయం ద్వారకా తిరుమల దేవాలయం ఆవరణలో (చిన్న తిరుపతి) ఆపరేషన్ సింధూర్ విజయవంతం దేశానికి విజయం సాధించాలని.. వీరమరణం పొందిన సైనికుల ఆత్మ శాంతి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ప్రత్యేక పూజలు నిర్వహించి, యుద్ధానికి సంఘీభావానికి మద్దతుగా జాతీయ జెండాలను ప్రదర్శించూ మనందరం భారతీయులం-భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సిఎస్‌సి కోర్టు సీనియర్ సూపర్‌నెంట్ పివిపి అంజనీ కుమారి మాట్లాడుతూ దేశ సైనికుల దేశభక్తి పోరాటపటిమ మీరు చూపే ధైర్యం క్రమశిక్షణ త్యాగాలు దేశానికి బలం, నేటి యువత దేశ సైనికులను స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు మాతృ దినోత్సవం భారతదేశ నినాదం మాతృదేవో పితృదేవో భవ జన్మించిన ఆచార్యదేవో భవ జన్మనిచ్చిన తల్లి భూమి ఒకటేనని దేశం కోసం ఎంతోమంది వీర సైనికులు మరణించారని మనం మరణించకపోయినా మనమంతా భారతీయులం భరతమాత కి జై అని నినాదం గనక ఇస్తే వారికి మనోధైర్యం సిద్ధిస్తుందని మద్దతు తెలిపినట్టేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ద్వారకాతిరుమల పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సుధీర్ ,హెల్ప్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కంచర్ల బుల్లిబాబు వేటపాలెం బీసీ వెల్ఫేర్ బాలుర వసతి గృహ అధికారి సి. నారాయణస్వామి, ప్రముఖ సాహితీవేత్త సింహాద్రి, సీత మహాలక్ష్మి మూర్తి, కేశవరాజు, వెంకట ప్రభాకర్, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన స్వచ్ఛంద సేవకులు, సాహితీవేత్తలు, తర్వాత.