ధూప దీప నైవేద్య పథకానికి దరఖాస్తు చేయండి
మాజీ జడ్పీటీసీ బత్తుల అంజి
ములకలపల్లి, మే 2 (మనఊరు ప్రతినిధి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధి, ములకలపల్లి మండల పరిధిలోగల గ్రామీణ ప్రాంతాలలో ఉన్న అర్హత కలిగినటువంటి దేవాలయాలకు తెలంగాణ ప్రభుత్వం ద్వారా వర్తించనున్న ధూప దీప నైవేద్యం పథకం కొరకు దరఖాస్తు చేసుకోవాలని భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ నాయకులు బత్తుల అంజి కోరారు. అర్హత కలిగి ఎన్ని గుడులు ఉన్న అన్నింటికీ పథకం వర్తించేలా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సారధ్యంలో దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకువెళ్ళనున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామీణ ప్రాంతాలలో ఆలయ కమిటీలు దరఖాస్తు చేసుకోవడం ద్వారా ధూప దీప నైవేద్యానికి ప్రతి నెల 4 వేల రూపాయలు అర్చకుల గౌరవ వేతనం 6వేల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం అందించనుందని ఆయన తెలిపారు. మే 25 చివరి తేదీ ఈ లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.