2న ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో పురుషులకు కుట్టుకోతలేని NSV నోస్కల్పెల్ వ్యాసెక్టమి ఆపరేషన్ శిబిరం...*
నాగర్ కర్నూల్, జూన్ 29 (మనఊరు ప్రతినిధి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో జులై 2న బుధవారం నాడు ఉదయం 11గంటలకు పురుషులకు ఎలాంటి కుట్టు కోత లేకుండా NSV (నో స్కాల్పెల్ వాసెక్టమి) వ్యాసెక్టమి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ప్రత్యేక చికిత్స శిబిరము నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ ఆర్.రఘు తెలిపారు. మహిళలకు గతంలో సిజేరియన్ ప్రసవాలు జరిగి ఇబ్బందులు ఉన్నవారి భర్త, ఫిట్స్ లేదా మూర్ఛ రోగం ఉన్న వారి యొక్క భర్త, కుటుంబ నియంత్రణలో భాగంగా భార్య ఆరోగ్యం దృష్ట్యా మగవారు వేసక్టమి ఆపరేషన్ చేయించుకోవాలని ఆయన సూచించారు.
ఆపరేషన్ చేయించుకోదలచిన మగ వారు తమ వెంట ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ,సెల్ నెంబర్ తో హాజరుకావాలని వారికి ఎలాంటి కుట్టు కోత లేకుండా,సుశిక్షితులైన ప్రత్యేక వైద్య నిపుణుల వారిచే NSV ఆపరేషన్ ఉచితంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. కేవలం 2 నుండి 5 నిమిషాలలో ఆపరేషన్ చేసి ఉచితంగా మందులు ఇచ్చి పంపనన్నట్లు తెలిపారు.మరిన్ని వివరాలకు ప్రభుత్వ సాధారణ ఆస్పత్రి హెల్ప్ డెస్క్ ఇన్చార్జి టి.యాదగిరి నేరుగా లేదా సెల్ నెంబర్ 9014932408 లో సంప్రదించలని సూచించారు.