వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
బీహార్ ఔరంగాబాద్‌లో ఓ మహిళ తన ప్రేమికుడితో కలిసి భర్తపై స్కార్పియో వాహనం ఎక్కించి హత్య చేసింది. ఆసుపత్రికి వెళ్లామని భర్తను ఇంటి నుంచి తీసుకెళ్లిన ఆమె, తన ప్రేమికుడు నడుపుతున్న కారులో తీసుకెళ్లి ఓ క్లినిక్‌లో చూపించింది. తిరిగొచ్చే క్రమంలో టైర్ పంక్చర్ అయిందేమో చూడాలని భర్తకు చెప్పింది. అతడు వాహనం దిగిన వెంటనే స్కార్పియోతో గుద్దించింది. రోడ్డుపై పడిపోయిన అతడి పైనుంచి కారును పలుమార్లు పోనించారు.