ఆత్మరక్షణ కోసం కరాటే

        ఆత్మరక్షణ కోసం కరాటే ఎంతో అవసరం 







జడ్చర్ల రూరల్, జూన్ 15 (మనఊరు ప్రతినిధి): ఆత్మరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కరాటే నేర్చుకోవాలని ఎస్సై ఖాదర్ అన్నారు. ఆదివారం పట్టణంలోని లయన్ క్లబ్‌లో నిర్వహించిన కరాటే బెల్ట్ పరీక్షలు జరిగాయి. గెలుపొందిన కరాటే విద్యార్థులకు ఆయన బెల్టులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు జాతీయ స్థాయిలో కూడా గెలుపొందింది ఈ మంచి గుర్తింపును తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. నేటి సమాజంలో మహిళలకు రక్షణగా ఉండేందుకు, ప్రతి ఒక్కరూ మహిళలు కరాటే నేర్చుకొని, దృఢంగా తయారు చేయాలని, నేటి సమాజంలో చెడును ఎదుర్కునేందుకు గుండె నిబ్బరంతో ధైర్యంతో బతికేందుకు జీకే మాస్టర్ సోటో కన్ కరాటే డు ఇండియా ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. బెల్ట్ పరీక్షలలో విద్యార్థులు చాలా చక్కని ప్రతిభను చూపించి బెల్ట్ సర్టిఫికెట్ ని సాధించడం జరిగింది. ఈ బెల్ట్ ఎగ్జామ్ లో ఆప్యా అనే విద్యార్థిని చక్కని ప్రతిభను కనబర్చింది. ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్ జగన్, వైఐపి అకాడమీ స్టేట్ ప్రెసిడెంట్ తన్వీర్, లీగల్ అడ్వకేట్ ఇంతియాజ్, ఎగ్జామినర్ ఇలియాస్ మాస్టర్, మాస్టర్ సయ్యద్ అశ్వం, కరాటే విద్యార్థులు, సాధించారు.
Previous Post Next Post