ఏసీబీ వలలో చిక్కిన ఆర్ఐ..

 ఏసీబీ వలలో చిక్కిన ఆర్ఐ..

ఒక వ్యక్తి నుంచి రూ. 4వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన భూత్పూర్ ఆర్ఐ బాలసుబ్రమణ్యం


భూత్పూర్ ఆగస్టు 1 (మనఊరు ప్రతినిధి): మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు శుక్రవారం దాడి చేసి రూ. 4వేలు లంచం తీసుకుంటున్న రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ బాలసుబ్రమణ్యంను రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డిఎస్పి హెచ్ .బాలకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి విచారణ చేయడం కోసం మొత్తం రూ ఎనిమిది వేలు ఆర్ఐ అడుగుతున్నారని ఏసీబీకి ఓ వ్యక్తి సమాచారం అందజేశారు. ఆ వ్యక్తితో ఎనిమిది వేలు ఒప్పందం కుదుర్చుకున్నాడని శుక్రవారం మండలంలోని ఆసుపత్రి సమీపంలోని ఒక వ్యక్తి రూ 4వేలు ఆర్ఐ బాలసుబ్రహ్మణ్యంకు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గాపట్టుకున్నట్లు ఆయన తెలిపారు. పట్టుబడ్డ ఆర్ఐని కోర్టులో హాజరు పరుస్తామన్నారు. ఎవరైనా డబ్బులు అడిగన తమకు సమాచారం ఇవ్వాలని ఆయన తెలిపారు. సమాచారం ఇచ్చిన వ్యక్తి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. పబ్లిక్‌ సర్వెంట్‌ ఎవరైనా అవినీతి, అక్రమాలకు పాల్పడితే టోల్‌ ఫ్రీ నంబర్‌ 1064 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు.

Previous Post Next Post