వందేళ్ల వేడుకను విజయవంతం చేద్దాం..
- నవంబర్ 27, 28, 29 తేదీల్లో బాదేపల్లి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల శతాబ్ది ఉత్సవాలు
- ఆగస్టు 31న పూర్వ విద్యార్థుల సన్నాహాక సమావేశం
- శతాబ్ది ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రవిశంకర్ వెల్లడి
జడ్చర్ల, రూరల్, ఆగస్టు 2 (మనఊరు ప్రతినిధి): బాదేపల్లి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల శతాబ్ది ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని, ఈనెల 31న పట్టణంలోని చంద్ర గార్డెన్ లో పూర్వ విద్యార్థుల సన్నాహక సమావేశం ఉంటుందని కమిటీ అధ్యక్షుడు రవిశంకర్. శనివారం జడ్పీహెచ్‌ఎస్ బాలుర బాదేపల్లి పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నవంబర్ 27, 28, 29 తేదీల్లో శతాబ్ది ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు. అందులో భాగంగా నిర్వహించే సన్నాహక సమావేశానికి పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో తరలిరావాలని. శతాబ్ది ఉత్సవాలకు సంబంధించి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పూర్తి సహకారం అందిస్తున్నారని స్పష్టం చేశారు. 1925లో ప్రారంభమైన పాఠశాల దినదినాభివృద్ధి చెందుతూ ప్రస్తుతం మూడు భాషల్లో బోధన కొనసాగుతుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న మూడవ పాఠశాలగా అభిప్రాయపడ్డారు. బడి రుణం తీర్చుకునేందుకు ప్రతి పూర్వ విద్యార్థి ఉత్సవాల్లో భాగస్వామ్యం కావాలని. వేలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసించి ఉన్నత స్థానాల్లో ఉన్నారని దేశ విదేశాల్లోనూ పేరు ప్రఖ్యాతలు గాంచారని తెలిపారు. అలాంటి హై స్కూల్ శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం అందులో భాగస్వామ్యం కావడం వరమన్నారు. ప్రధానోపాధ్యాయురాలు చంద్రకళ మాట్లాడుతూ శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేసుకుందామని అందుకు తమ పూర్తి సహకారం అందజేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో శతాబ్ది ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి వెంకటరమణాచార్యులు, వర్కింగ్ ప్రెసిడెంట్ వి.కృష్ణ, ఉపాధ్యక్షులు సయ్యద్ ఇబ్రహీం, గోపాల్, పెద్దలు బాలకృష్ణ, ఆకుల వెంకటే,ష్ జీనురాల సత్యం, టైటాన్స్ సత్యం, శ్రీనివాస్ చారి, జయప్రకాష్, ప్రకాష్, సంతోష్ చారి, కార్యనిర్వహణ కార్యదర్శి కంచుకోట ఆనంద్, రాఘవేందర్ గౌడ్, ఉపాధ్యాయులు సునీల్, పూర్వ విద్యార్ధులు ఉన్నారు.