*పి.వై.ఎల్ నూతన కమిటీ ఎన్నిక*
ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ (పి.వై.ఎల్) గ్రేటర్ హైద్రాబాద్ ఆదివారం మార్క్స్ భవన్ లో జనరల్ కౌన్సిల్ జరిగింది. దీనిలో నూతన కమిటీని ఎన్నుకున్నట్లు పి.వై.ఎల్ రాష్ట్ర అధ్యక్షులు కె. ఎస్ ప్రదీప్ తెలిపారు. నూతన అధ్యక్షులు బి. ఎస్ కృష్ణ (విద్యానగర్), కార్యదర్శి కొల్లూర్ భీమేష్ (బాలాపూర్), ఉపాధ్యక్షులు బంగారి శ్రీనివాస్ (ముషీరాబాద్), మల్లేష్ (గోల్కొండ), సహాయ కార్యదర్శి కుంబోజీ కిరణ్ (అశోక్ నగర్), బాలు (లంగర్ హౌస్), కోశాధికారి ప్రకాశ్ (ఉప్పల్) లతో పాటు 10మంది సభ్యులను కలిపి మొత్తం 17 మందితో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా గ్రేట్ హైదరాబాద్ నూతన అధ్యక్ష, కార్యదర్శులు బి. ఎస్ కృష్ణ, కొల్లూర్ భీమేష్ మాట్లాడుతూ హైదరాబాద్ లో యువత డ్రగ్స్, గంజాయి మత్తు మందులో మునిగి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వీటిని అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉద్యోగ క్యాలండర్ మాత్రమే కాకుండా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని, జూలై 4న నిరుద్యోగులు తలపెట్టిన చలో సెక్రటేరియట్ కి పి.వై.ఎల్ మద్దతు ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పి.వై.ఎల్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏం. రవికుమార్, గ్రేటర్ హైదరాబాద్ నాయకులు కె. కిరణ్, ప్రకాష్, అంజి, నరేష్, రవి, రాజు, వి. సురేష్, సాయి కుమార్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
The Progressive Youth League (PYL) Greater Hyderabad held a general council meeting on Sunday at Marx Bhavan, where a new committee was elected. PYL state president K.S. Pradeep announced that B.S. Krishna (Vidyangar) was elected president, Kollur Bhimesh (Balapur) as secretary, Bangari Srinivasa (Mushirabad) and Mallesh (Golconda) as vice-presidents, Kumboji Kiran (Ashok Nagar) and Balu (Langar House) as assistant secretaries, and Prakash (Uppal) as treasurer. A total of 17 members were unanimously elected, including 10 other members.
The newly elected president and secretary, B.S. Krishna and Kollur Bhimesh, stated that youth in Hyderabad are being destroyed by drugs, ganja, and intoxicants, and they demanded the government take steps to stop it.
They also demanded the release of job notifications in addition to the job calendar and announced PYL's support for the "Chalo Secretariat" protest planned by unemployed individuals on July 4th.
PYL state assistant secretary M. Ravikumar, Greater Hyderabad leaders K. Kiran, Prakash, Anji, Naresh, Ravi, Raju, V. Suresh, Sai Kumar, and Narender, among others, participated in the event.