సాగరులను బీసీ డి నుంచి బీసీ ఎ మలోకి మార్చాలి

 సాగరులను బీసీ డి నుంచి బీసీ ఎ మలోకి మార్చాలి 

 జిల్లా అధ్యక్షులు ప్రణీలు చందర్ సగర 




జడ్చర్ల రూరల్, జులై 6 (మనఊరు ప్రతినిధి): సగర కులస్థులను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలని, సగర ఫెడరేషన్లను కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని జిల్లా సగర ఉప్పర సంఘం జిల్లా అధ్యక్షులు పాలకొండ ప్రణీలు చందర్ సగర కోరారు. ఆదివారం ప్రేరణ బ్రిలియంట్ స్కూల్లో మండలంలో జడ్చర్ల మండల సగర (ఉప్పర) సంఘం ఎన్నికలు నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో సగరులకు అధిక సీట్ల కేటాయింపు, కార్మిక సంక్షేమ మండలి ఛైర్మన్గా సగరులను నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయకుండా కుల గణన సర్వే నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. సగరులకు గతంలో ప్రభుత్వం 59 జీవోను దానిని పునరుద్ధరించాలన్నారు. సగరుల కులవృత్తి అయిన నిర్మాణ రంగంలో ప్రభుత్వపరంగా నిర్వహించే ప్రభుత్వ కాంట్రాక్టు పనులలో ఈఎండి లేకుండా సగర సొసైటీలకు పనులు కేటాయించాలన్నారు. సగర ఉప్పరులు కులవృత్తిపై ఆధారపడి జీవించిన వారికి కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.

  

జడ్చర్ల మండల అధ్యక్షులుగా మధుసాగర్

జడ్చర్ల మండల అధ్యక్షులుగా వేముల మధుసాగర్, ప్రధాన కార్యదర్శిగా వావిలాల శంకర్, కోశాధికారిగా చంద్రశేఖర్ లను జిల్లా సగర ఉప్పర సంఘం జిల్లా అధ్యక్షులు పాలకొండ ప్రణీలు చందర్ సగర ఆధ్వర్యంలో ఎకగ్రివంగా ఎన్నుకున్నారు. ఈ మండల కమిటీ మూడు సంవత్సరాల పాటు సంఘానికి సేవలు అందించనున్నారని తెలిపారు. ఎన్నికల పరిశీలకులుగా ఎ. సుదాకర్ సాగర్, గోపీనాథ్ సాగర్ వ్యవహరించినారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సత్యం సాగర్, బి పర్వతాలు సాగర్, ఏ రవి సాగర్, బుడ్డన్న సాగర్, చంద్రమోహన్ సాగర్, సత్యం సాగర్, ప్రశాంత్ సాగర్ టీచర్, తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post