ఉపాధ్యాయురాలుకు పదవీ విరమణ వీడ్కోలు

 ఉపాధ్యాయురాలుకు పదవీ విరమణ వీడ్కోలు

మరికల్, జూన్ 30 (మనఊరు ప్రతినిధి): మండల కేంద్రంలోని జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో జీవశాస్త్రం ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్న జూలూరి విజయలక్ష్మి సోమవారం ఉద్యోగ పెదవి విరమణ పొందారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు విద్యార్థినులు గ్రామస్తులు గ్రామ పెద్దలు అందరు కలిసి పదవి విరమణ పొందిన ఉపాధ్యాయురాలు విజయలక్ష్మికి పాఠశాలలో ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో శాలువలతో సన్మానించారు. ఈ సందర్భంగా హెచ్ఎం సర్వమంగళ మాట్లాడుతూ ఉపాధ్యాయురాలుగా సుమారు 36 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎందరో మంది విద్యార్థులు విద్యార్థులను విద్యాబుధుల నేర్పి ఉన్నత స్థాయిలో విద్యను అందించి ఎందరో మంది జీవితాలను వెలుగు నింపిన మహోన్నత వ్యక్తి విజయలక్ష్మి అని అన్నారు. విజయలక్ష్మి విద్యార్థులకు చక్కగా బోధన అందించి తల్లి, తండ్రి లేని పేద విద్యార్థులకు దుస్తులు, పెన్నులు పెన్సిళ్లు అందజేసి మంచి క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని విద్యార్థులను ప్రోత్సహించారని తెలిపారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆమె సమకూర్చిన సొంత డబ్బుతో పాఠశాలకు సైన్స్ ల్యాబ్ పరికరాలకు ఇరవై వేలు, లైబ్రరీ లో పుస్తకాలకు, అభివృద్ది పనులకు ముప్పై వేలు సమకూర్చారని అన్నారు. ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజమని ఇన్ని రోజులు వివిధ పాఠశాలల్లో పనిచేసి విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. శేష జీవితం కూడా సేవాభావంతో కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటూ ఆయురారోగ్యాలతో ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సరస్వతి, శైలజ, మల్లప్ప, రామక్రిష్ణ, శివప్రసాద్, మల్లయ్య, అంజలయ్య, పాండురంగయ్యచారి, రాజశేఖర్, ఇస్మాయిల్, శశిధర్, రత్నమాల, మనీషా, శ్రీలక్ష్మి, రమాదేవి, పాల్గొన్నారు.

Previous Post Next Post