త్యాగానికి ప్రతీక బక్రీద్

 *_త్యాగానికి ప్రతీక బక్రీద్_* 

*నిర్దవెల్లిలో ఘనంగా బక్రీద్ పర్వదినం* 

కేశంపేట, జూన్ 7 (మనఊరు ప్రతినిధి): మండల పరిధిలోని నిర్దవెల్లి గ్రామంలో శనివారం ముస్లిం సోదరులు బక్రీద్ పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.నిర్దవెల్లి గ్రామ సమీపంలో ఉన్న ఈద్గా వద్ద సామూహిక ప్రార్థనలు నిర్వహించి బక్రీద్ పర్వదినం యొక్క విశిష్ట గురించి మత పెద్దలు వివరించారు. అనంతరం ముస్లిం సోదరులు ఒకరికొకరు అలింగణం చేసుకొని బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. స్థానిక నాయకులు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో మండల ముస్లిం ఫ్రంట్ అధ్యక్షులు ఎండి. మక్బుల్ ,జబ్బార్ ఖాన్, హఫీజ్ ఖాన్,ఖాలిక్ మౌలిసబ్, నసీరుద్దీన్,అర్మాన్,జాహెద్ , ఇస్మాయిల్,జబ్బర్,అజిస్ ఖాన్, అమేర్ ,ఖాజా,ఫైజన్ ,పాషా,సిరాజ్, వాజీద్,బద్రుద్దీన్,అజహర్ ,జాకీర్, శాబొద్దీన్,మజహర్,స్థానిక నాయకులు సింగల్ విండో డైరక్టర్ పల్లాటి కృష్ణయ్య నాయకులు జై సింగ్ ,సుధాకర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post